
మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ IPS. గత కొంత కాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కొందరు చేపల వ్యాపారం చేసే వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి అనగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుండి వ్యక్తులను రవాణా చేసుకొని వారితో వెట్టి చాకిరి చేయించుకుని ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయానికి గురి చేస్తూ పని సమయ వేళలు పాటించకుండా ఆదిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేపించుకుంటున్న వ్యక్తుల చెరనుండి , దేవరకొండ సబ్ డివిజన్ పరిధి లో 32 కార్మికులు, 4గురు బాలకార్మికులు, మొత్తం 36 మంది వెట్టిచాకిరి బాధితులను జిల్లా పోలీసు,రెవెన్యూ,చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి నది పరిపాక ప్రాంతంలోని వ్యక్తులను గుర్తించి రెస్క్యూ చేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. 1) వడ్త్య జవాహర్ లాల్ తండ్రి: రాములు, 2) రామవత్ రమేష్ తండ్రి: లక్పతి, 3) మైలపల్లి శివ తండ్రి: దేవుడు, 4) కారే సింహా చలం తండ్రి: సింహా చలం, 5) వంక విశాఖ @ ఇషాక్ తండ్రి: మహంకాల్, 6) ఎరిపల్లి బాబుజీ @ బావొజి తండ్రి: బంగారి, 7) చాపల తాత రావు తండ్రి: సోమరాజు,
8) చాపల బంగారి తండ్రి: బంగారి.
- Cr.No.66/2025 U/s 143(4), 146 BNS sec.79 of JJ Act of PS Neredugommu
- Cr.No.68/2025 U/s 146 BNS sec.18 of BLSA of PS Neredugommu
- Cr.No.69/2025 U/s 146 BNS sec.75 of JJ Act, Sec.18 of BLSA of PS Neredugommu
- Cr.No.117/2025 U/s 146 BNS sec.18 of BLSA of PS Gudipally
- Cr.No.118/2025 U/s 146 BNS sec.75 of JJ Act, sec.18 of BLSA of PS Gudipally
పైన తెలిపిన నిందితులలో గుడిపల్లికి చెందిన జబ్బార్ @ జవహర్ లాల్, రమేశ్ మరియు శివలు వీరి ఏజెంట్లు అయిన రాజు,(హైద్రాబాద్) జగన్, (హైద్రాబాద్) లోకేశ్ (విజయవాడ)లకు ఒక వ్యక్తి కి 1500 చొప్పున కమిషన్ ఇచ్చి హైద్రాబాద్ విజయవాడ నుంచి వలస కార్మికులను నెలకు 15 వేల జీతం, రోజుకి 2 గంటల పని, ఉచిత ఆహారం మరియు మద్యం సరఫరా చేస్తాం అని మబ్య పెట్టి వారిని అక్కడ నుంచి దేవరకొండ లోని మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడ నుంచి నిందితులు వారి సెల్ ఫోన్ తమ అదినంలో పెట్టుకొని వారిని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల పైన నేరేడు గుమ్ము పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణాలకుంట,వైజాగ్ కాలనీ కి తరలించి వారితో అక్కడ తెల్లవారు జామునా నదిలోకి చేపలు పట్టుటకు పంపేవారు. అలాగే చేపల వలలు లాగుటకు ఉపయోగించుకునేవారు. వీరికి రోజుకు రెండు పూటలా మాత్రమే ఆహారం అందిచేవారు. వీరికి పని బారం ఎక్కువ అయితుంది మేము చేసిన పనికి డబ్బులు ఇవ్వవలసిందిగా కోరగా డబ్బులు ఇవ్వకుండా వీరిని హింసిస్తూ వాతలు పెట్టేవారు. ఇదే విదంగా నిందితులు అయిన ఇషాక్ మరియు సింహాచలం వారి ఏజెంట్ అయిన వెంకన్న (విజయవాడ) (5000 ఒక్కరికీ కమిషన్) కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. పైన తెలిపిన ఏజెంట్లు అయిన రాజు,జగన్,లోకేశ్,వెంకన్నలు కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అదుపులోకి తీసుకొనీ పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులను అక్రమ రవాణా చేసి వారిని బెదిరించి లేదా గాయపరిచి వారితో ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా సమయవేళలు పాటించకుండా పనులు చేయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బాల బాలికలను పనిలో పెట్టుకున్న చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకున్న child హెల్ప్ లైన్ నంబర్1098, women help line 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ కోరినారు. ఇట్టి ఆపరేషన్ ను దేవరకొండ ఎ ఎస్పి మౌనిక పర్యవేక్షణలో డిండి, కొండమల్లేపల్లి సిఐ లు మరియు గుడిపల్లి, నేరేడు గుమ్ము , గుర్రంపోడ్ ఎస్సై రెవెన్యూ, చైల్డ్ కేర్,child లైన్ ,CWC బృందం మరియు నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, వి.పి.ఓ ప్రశాంత్, వై.నరేందర్ రెడ్డి తదితరులు జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.
