
పోలీస్ అధికారులు,సిబ్బంది పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజలకు సమర్ధవంతమైన సేవాలందించాలని,స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులకు సూచించారు.
పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్,కిట్ ఆర్టికల్స్ తనిఖీతో పాటుగా పోలీస్ స్టేషన్ రిసెప్షన్,సిసిటిఎన్‌ఎస్ విభాగాల పనీతీరు పలు రికార్డులను పెండింగ్ కేసులు,కోర్టు కేసులు,ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులపై రివ్యూ చేసి పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించిన జిల్లా ఎస్పీ. చందుర్తి సర్కిల్ కార్యాలయన్నీ తనిఖీ చేసి సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ ,క్రైం రికార్డు,ప్రాపర్టీ రిజిస్టర్,పిటిషన్ రిజిస్టర్ లను పరిశీలించి,సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా ఎస్సై ల ద్వారా చర్యలు తీసుకోవాలని సి.ఐ కి సూచించారు. తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమర్ధవంతమైన సేవాలందించాలని,గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ప్రజలతో మంచి సస్సబంధాలు కొనసాగిస్తూ గ్రామాలలో జరిగే శాంతి భద్రతల విషయాలను ముందస్తుగా తెలిసేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు.స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు,హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెట్రోలింగ్ సమయంలో సిబ్బంది,అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని,చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా కఠినతరం చేస్తునే వాటి వలన కలుగు అనర్ధాలపై, సైబర్ నెరల నియంత్రణ పై చైతన్య పరచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలసి మొక్కలు నాటిన అనంతరం పోలీస్ అధికారులు,సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన షటిల్ కోర్టు ప్రారంభించి వారితో కలసి షటిల్ ఆడిన ఎస్పీ. ఎస్పీ వెంట సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు.రమేష్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.

