బ్రేకింగ్ న్యూస్
ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు
Uncategorized

పోలీసులలో ప్రతిభను వెలికి తీయడానికే పోలీసు డ్యూటి మీట్స్ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ips.

•జోనల్ డ్యూటి మీట్ నందు ప్రతిభ చాటిన సంగారెడ్డి, వికారాబాద్ పోలీసు అధికారులు, జాగిలాలను రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ కు ఎంపికా.
•రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ నందు సత్తా చాటాలి. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్.
జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జోనల్ డ్యూటి మీట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్. గత నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి డ్యూటీ మీట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ కు ఎంపిక చేయడానికి, జోన్-VI లో కమిషనరేట్స్ మినహా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన 58-మంది అధికారులు, సిబ్బందికి, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోసల్ టీంలకు జోనల్ లెవెల్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. జోనల్ డ్యూటి మీట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 26-07-2025 నాడు వరంగల్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ కు ఎంపిక చేయడం జరుగుతుందిని అన్నారు. పోలీసుల ప్రతిభను వెలికి తీయడానికే పోలీసు డ్యూటి మీట్.. నిర్వహించడం జరుగుతుందని ఈ డ్యూటీ మీట్ నందు సైంటిఫిక్ ఎవిడెన్స్, నేరం జరిగిన తర్వాత నేరస్థలాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, నేరస్థలం నందు క్లూస్ ఏ విధంగా సేకరించాలి, కంప్యూటర్ పరిజ్ఞానం, మరియు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పని తీరుపై పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ నెల 26 న వరంగల్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ నందు సత్తా చాటి, అనంతరం పూనే లో జరిగే నేషనల్ స్థాయి డ్యూటి మీట్ కు అర్హత సాధించాలి అన్నారు. పోలీసుల పనితీరుకు అద్దం పటె ఇన్వెస్టేగేషన్ లో మెళకువలు ఈ డ్యూటి మీట్ ద్వారా మరింత మెరుగ్గా నేర్చుకోవచ్చు అన్నారు. సరైన పద్ధతిలో ఇన్వెస్టేగేషన్ చేసి కేసును డిటెక్ట్ చేసినట్లయితే ప్రజలలో పోలీసుల పై నమ్మకం పెరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంబడి డ్యూటి మీట్ నోడల్ అధికారి అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, డీసీఆర్బీ డియస్పి శ్రీనివాస్ రావ్, ఎ.ఆర్.డియస్పి నరేందర్, వికారాబాద్ డ్యూటి మీట్ నోడల్ అధికారి ఎ.ఆర్.డియస్పి వీరేష్, యస్.బి ఇన్స్పెక్టర్స్ విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్స్ రమేష్ డ్యూటి మీట్ అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్