Breaking News

నిఘా నేత్రం నీడలో చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిష్టంపెట్ గ్రామం – జిల్లా ఎస్పీ.

నేరాల నియంత్రణ,కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీస్ వారికి అందించాలి. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు ముందుకు రావడం అభినందనీయం. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.,చందుర్తి పోలీస్ స్టేషన్ పరోధిలోని క్రిష్టంపెట్ గ్రామంలో ఏర్పాటు చేసిన 09 సీసీ కెమెరాలను,పోలీస్ అధికారులు , గ్రామప్రజలు,ప్రజాప్రదినిధులతో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు ముందుకు రావడం అభినందనియమని మిగిలిన గ్రామ ప్రజలు కూడా స్వీయారక్షణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని,గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని,గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని,సీసీ కెమెరాల ద్వారా ఈమధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు. కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని,పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామల ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు. గ్రామాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తుల సామాచారం,గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల సమాచారం పోలీస్ వారికి అందించాలన్నారు. ప్రజలు యువకులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలు పాటించాలన్నారు. సనుగుల గ్రామంలో కల.గోవిందరాజుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ. ఎస్పీ వెంట సి.ఐ వెంకటేశ్వర్లు,ఎస్.ఐ రమేష్,గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు,పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *