
పురానీ హవేలీ భవనాన్ని తిరిగి ప్రారంభించేందుకు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేశారు. హైదరాబాదు నగరములో ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఇంకా సిసి కెమెరాలు పెంచడానికి నిధులు ఇస్తున్నామని తెలిపారు. అలాగే, నూతనంగా నిర్మించిన కాలాపత్తర్ , చత్రినాక ట్రాఫిక్ పి.ఎస్ మరియు శాలిబండ పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. సి.వి. ఆనంద్, ఐపీఎస్, డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, ఈ భవనం గతంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంగా ఉండేదని, దీనిని “The Kotwal House”” అని కూడా పిలిచేవారని, 1920 నుండి 2002 వరకు పోలీసు ప్రధాన కార్యాలయంగా పనిచేసిందని తెలిపారు. పురానీ హవేలీ భవనం హైదరాబాద్ చరిత్రలో చాలా ముఖ్యమైనదని, నాలుగేళ్ల క్రితం దీని పైకప్పు కూలిపోయినప్పుడు పడగొట్టాలని అనుకున్నారని గుర్తు చేశారు. అయితే, మన చరిత్రను కాపాడాలని, ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారనుకున్న సమయంలో చలమలశెట్టి అనిల్ కుమార్, డైరెక్టర్, Ace Urban Developers Pvt. Limited, Greenko Group, Group CEO & MD దీని పునరుద్ధరణకు ముందుకు వచ్చి, అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పారని వివరించారు. ఈ పునరుద్ధరణ పనులు 2022 డిసెంబర్‌లో మొదలయ్యాయని, పాత కట్టడాలను బాగుచేయాలంటే చాలా ఓపిక కావాలని తెలిపారు. డెక్కన్ టెర్రైన్ ఏజెన్సీస్ నుండి Mir Barkatullah Khan (Architect), చాలా బాగా పని చేశారని ప్రశంసించారు. ఇకపై, హైదరాబాద్ నగర కొత్వాల్ పాత నగరానికి వచ్చినప్పుడు కూర్చోవడానికి ఒక మంచి స్థలం ఉంటుందని తెలిపారు. ఈ చారిత్రక కట్టడాన్ని తిరిగి కాపాడినందుకు అందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఐసీసీసీ భవనం, బంజారా హిల్స్, రోడ్డు నెం. 12 నుండి పనిచేస్తుందని, ఇక నుండి వారంలో ఒక రోజు శుక్రవారం పురానీ హవేలీ నుండి, ఒక రోజు బషీర్‌బాగ్‌లోని కార్యాలయం నుండి, మిగతా రోజులు బంజారా హిల్స్‌లోని కార్యాలయం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటానని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండడి అనిల్ కుమార్ యాదవ్ (MP),అసదుద్దీన్ ఒవైసీ (MP),మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి (MLC),మీర్జా రహమత్ బేగ్ (MLC),మీర్ జుల్ఫెకార్ అలీ (MLA,చార్మినార్), మహ్మద్ ముబీన్ (MLA,బహదూర్‌పురా), పీ. విశ్వప్రసాద్, ఐపీఎస్ (అదనపు సీపీ, క్రైమ్, హైదరాబాద్ సిటీ), డి. జోయెల్ డేవిస్, ఐపీఎస్ (జాయింట్ సీపీ, ట్రాఫిక్, హైదరాబాద్),Ms.స్నేహా మెహ్రా, ఐపీఎస్ (డీసీపీ, సౌత్ జోన్, హైదరాబాద్), ఎ.ఆర్. శ్రీనివాస్, ఐపీఎస్ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్),ఎం. రమేష్ రెడ్డి, ఐపీఎస్ (ఎండీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్), శ్రీమతి కె. అపూర్వ రావు ఐపీఎస్ (డీసీపీ ఎస్‌బి), శ్రీమతి రక్షిత కృష్ణ మూర్తి ఐపీఎస్ (డీసీపీ సిఎఆర్ హెడ్ క్వార్టర్స్), ఆర్. వెంకటేశ్వర్లు ఐపీఎస్ (డీసీపీ ట్రాఫిక్), చైతన్య కుమార్ (డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్) లు పాల్గొన్నారు.

