Breaking News

పాఠశాలలు, కాలేజీల్లో “సేఫ్టీ క్లబ్” ప్రారంభించిన – హైదరాబాద్ సిటీ పోలీస్.

విద్యార్థులను safety advocates గా, హైదరాబాద్‌ను అత్యంత భద్రత గల నగరంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు తెలంగాణ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం ఆలోచనలకు అనుగుణంగా, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి, విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో, “సేఫ్టీ క్లబ్” కార్యక్రమాన్ని ఏవీ కాలేజ్ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఏవీ కాలేజ్, సెయింట్ థెరిసా కాలేజ్, మరియు భారత్ స్కౌట్స్ & గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్లబ్ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారిస్తుంది. భౌతిక భద్రత, సైబర్ భద్రత, డ్రగ్స్ నివారణ, మరియు మానసిక ఆరోగ్యం. విద్యార్థుల నేతృత్వంలో ఉండే ఈ క్లబ్‌ల ద్వారా, వారు భద్రత, బాధ్యత, మరియు ఆత్మస్థైర్యం ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏవీ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజలింగం, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఐపీఎస్ కి మరియు హైదరాబాద్ కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. భద్రత అనేది కేవలం పాఠశాల గేట్ల వరకే పరిమితం కాదు. మనసు, భావోద్వేగాలు, డిజిటల్ ప్రపంచంలోనూ పిల్లలకి రక్షణ అవసరం. మా కాలేజ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉండటం గర్వకారణం. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి మా కాలేజ్ వేదిక కావడం ఆనందంగా ఉంది. శిల్పవల్లి ఐపీఎస్, డీసీపీ. సెంట్రల్ జోన్, మాట్లాడుతూ.”ఈ క్లబ్ పిల్లలను కట్టడి చేయడం కోసం కాదు, వాళ్లను శక్తివంతంగా తయారు చేయడానికే పిల్లలకి భద్రత ఎలా ఉండాలో, ఏం చేయాలో నేర్పడానికి ఇది మంచి అవకాశం. యువత ప్రమాదాలను గుర్తించి, తగిన విధంగా వివేకం తో స్పందించేలా, సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది. ఈ క్లబ్‌లు హైదరాబాద్‌ను భద్రమైన నగరంగా ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా మరియు తెలంగాణను డ్రగ్-ఫ్రీ రాష్ట్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.” అని పేర్కొన్నారు. అలాగే డోమల్గూడ ఎస్‌హెచ్ఓ మరియు గాంధీనగర్ ఏసీపీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆమె అభినందనలు తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఐఏఎస్ మాట్లాడుతూ.”ఈ క్లబ్ విద్యార్థుల్ని బాధ్యతతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం. ఇవి కేవలం క్లాస్‌రూమ్‌ కార్యక్రమాలు కాదు,జీవితానికి అవసరమైన పాఠాలు నేర్పేవి. ప్రతీ స్కూల్, కాలేజ్‌లో కూడా ఇవి ఏర్పాటు కావాలి.” అని అన్నారు. అలాగే,”విద్యార్థులు distractionsకు దూరంగా ఉండాలి. క్రమశిక్షణ, కృషితో జీవితంలో విజయం సాధించవచ్చు. ఈ క్లబ్‌లు యువతను change agentsగా తయారుచేస్తాయి. ఇవి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మరింత ముందుకు తీసుకుని వెళ్ళే రథ చక్రాలు అవుతాయి” అని Collector అన్నారు. సేఫ్టీ క్లబ్ ఎలా పనిచేస్తుంది. ప్రతి స్కూల్/కాలేజ్‌లో ఈ క్లబ్ ఇలా ఉంటుంది.
• ప్రిన్సిపాల్ – చైర్మన్
• బాలమిత్ర ఉపాధ్యాయులు – కన్వీనర్
• తల్లిదండ్రుల వాలంటీర్ – సేఫ్టీ గైడ్
• విద్యార్థులు – సేఫ్టీ advocates.
ప్రధాన కార్యకలాపాలు.
• సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు
• డ్రగ్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్స్
• మానసిక ఆరోగ్య వారాలు
• సెల్ఫ్ డిఫెన్స్, ఫైర్ డ్రిల్స్
• పియర్ అంబాసిడర్ల ప్రోగ్రామ్
• తల్లిదండ్రుల వర్క్‌షాప్‌లు
• న్యాయ అవగాహన సెషన్లు
విద్యార్థుల ప్రతిజ్ఞతో ముగింపు కార్యక్రమం చివర్లో విద్యార్థులు ఒక భద్రతా ప్రతిజ్ఞ చేశారు. అలాగే, డీఅడ్డిక్షన్ థెరపిస్ట్ దేవికా మరియు ఎన్సీబీ ప్రతినిధి ఆశిష్ చక్రవర్తి పాల్గొన్నారు.”ఈ క్లబ్‌లు స్కూల్స్‌/కాలేజీల భద్రతను మెరుగుపరుస్తాయి. విద్యార్ధులు సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాయి.”

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *