బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

మొహరం సంతాప దినాలలో హైదరాబాద్ పోలీసుల పటిష్ట బందోబస్తు – సీపీ సీవీ ఆనంద్.

మొహరం సంతాప దినాలను పురస్కరించుకొని, హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు డిజి సీవీ ఆనంద్ ఐపీఎస్ తెలిపారు. మొహరం 8వ రోజు సందర్భంగా దార్‌-ఉల్-షిఫా, డబీర్‌పురాలోని బీబీ కా ఆలంను సందర్శించి, అక్కడ పుష్పగుచ్ఛాలు, దట్టిలు సమర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు మరియు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మొహరం సంతాప దినాలు నేటికి 8వ రోజుకు చేరుకున్నాయని, మొహరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం తరపున మంత్రులు, షియా మత పెద్దలు, పోలీసు మరియు ఇతర శాఖల అధికారులతో అనేక సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమావేశాలలో వచ్చిన సూచనల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గత 8 రోజులుగా రోజువారీగా జరుగుతున్న చిన్న చిన్న ఊరేగింపులకు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నామని వివరించారు. ట్రాఫిక్ బందోబస్తు విషయమై మాట్లాడుతూ, బయటి నుండి అదనపు పోలీసు సిబ్బందిని రప్పించి, ట్రాఫిక్ డీసీపీల ఆధ్వర్యంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఊరేగింపు సమయాలలో స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు మరియు ఈవ్ టీజింగ్‌లు జరిగే అవకాశం ఉన్నందున, మన క్రైమ్ పోలీసులు మరియు షీటీమ్స్ అప్రమత్తంగా ఉండి, కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రేపు (9వ మొహరం) మరియు 10వ మొహరం రోజున భారీ సంఖ్యలో ప్రజలు సందర్శించే అవకాశం ఉన్నందున, ముందస్తు చర్యలో భాగంగా 3000 మంది పోలీసులతో మొహరం ఊరేగింపు శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీవీ ఆనంద్ 10వ మొహరం ఊరేగింపు మార్గాలను స్నేహా మెహ్రా ఐపీఎస్ (డీసీపీ సౌత్ జోన్), వెంకటేశ్వర్లు ఐపీఎస్ (డీసీపీ ట్రాఫిక్) మరియు ఇతర అధికారులతో కలిసి పరిశీలించి, ప్రశాంత వాతావరణంలో ఊరేగింపు జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. చివరగా, హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్, భద్రత మరియు సెక్యూరిటీ విషయంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారని, ప్రజలు కూడా పోలీసులతో సహకరించి, శాంతియుత వాతావరణంలో మొహరం వేడుకలు జరిగే విధంగా సహకరించాలని సీవీ ఆనంద్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్