Breaking News

లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేసిన ముగ్గురు అరెస్టు – మిర్యాలగూడ-I టౌన్ పోలీస్.

మిర్యాలగూడ లోని హౌసింగ్ బోర్డు కాలనీ లో RK Enterprisses అనే పేరుతో ఒక మల్టీ లెవల్ సంస్థను స్థాపించి, మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో అమాయక ప్రజలను లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన ముగ్గురు ఘరానా మోసగాళ్ళ ను చాకచక్యంగా పట్టుబడి చేసిన మిర్యాలగూడ-I టౌన్ పోలీసులు. వారి వద్దనుంచి సుమారు రూ. 70,00,000/- విలువ గల మోసగించిన సొత్తు ను స్వాధీనము చేసుకోని న్యాయస్థానానికి సమర్పించనైనది.
•నగదు రూ. 6,55,500/-.
•మోసము చేసిన్ సొమ్ముతో కొనుగోలు చేసిన రెండు ఓపెన్ ఫ్లాట్ల మరియు ఒక ఇంటి దస్తావేజు.
•మోసం చేసిన సొమ్ముతో ముడి మాణిక్యం గ్రామంలో లీజుకు తీసుకుని నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ దస్తావేజు.
•R.K. Enterpricess ఆఫీసు లోని ఫర్నీచర్ (TABLES, CHAIRS & అల్మారా).
•Two wheelers -2 (scooty & Pulsar Bike).
•వాషింగ్ మెషీన్ & వాటర్ ప్యూరిఫైర్.
•లాప్ టాప్ & కంప్యూటర్.
•బాధితులకు ఇవ్వడానికి తయారు చేసిన బ్రౌచర్ లు.

  1. కొమ్ము రమేష్ S/o రామయ్య, 2. కొమ్ము కోటేశ్వర రావు S/o లేట్ కోటయ్య, 3. బచ్చలకూరి శ్రీను S/o గురవయ్య, మిర్యాలగూడ లోని హౌసింగ్ బోర్డు కాలనీ లో RK Enterprisses అనే పేరుతో ఒక మల్టీ లెవల్ సంస్థను స్థాపించి పైన తెలిపిన ముగ్గురు నిందితులు, మిర్యాలగూడ టౌన్ మరియు చుట్టుపక్కల గ్రామాల పెద ప్రజలకు లక్కీ డ్రా స్కీమ్ పెట్టినామని మోసపు మాటలు చెప్పి, నెలకు ₹1000 రూపాయల చొప్పున 15 నెలలపాటు కడితే ప్రతినెల డ్రా తీసి, డ్రాలో వచ్చిన పదిమందికి విలువైన వస్తువుల ఆశ చూపి, 15 నెలలలో డ్రాలో రాకున్నా చివరకు కట్టిన మొత్తానికి అంత విలువ చేసే వస్తువులు లేదా కట్టిన మొత్త్తం తిరిగి ఇస్తాము అని ప్రచారం చేసి. ఎంపిక చేసుకున్న ఏజెంట్ లకు కమీషన్ ఆశ చూపి అమాయకపు ప్రజలను చేర్చుకునే వారు. అంతేకాకుండా ఇంకా ఎక్కువ మందిని జాయిన్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తామని ఏజెంట్ లకు ఆశ చూపి ఎక్కువ మంది సభ్యులు స్కీమ్ లో చేరే విధంగా ప్రతి నెల డ్రా లో వచ్చే వస్తువులు తెలిసే విధంగా రంగురంగుల పేజీలతో మరియు వారి పేర్లతో కూడిన ఆకర్షణీయమైన కార్డులను తయారు చేసి పంపిణీ చేసినారు. ఆ విధముగా మొత్తం 2143 మంది ని అట్టి లక్కీ డ్రా స్కీమ్ లో జాయిన్ చేసుకొని, వారి నుండి సుమారు RS: 1,85,79,000/- రూపాయలు కలెక్ట్ చేసినారు. అందులోనుంచి సుమారు యాభై లక్షల రూపాయలతో సభ్యుల సమ్మకము కోసము, లక్కీ డ్రా గిఫ్ట్ ల రూపములో ఖర్చు చేయడము జరిగినది. అట్టి స్కీమ్ పేరుతో అమాయకపు ప్రజల వద్ద నుంచి తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వక తమ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేయడముతో, బాధితులు మిర్యాలగూడ-1 టౌన్ వారిని ఆశ్రయించి ఫిర్యాదు చేసినారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసు లకు నమ్మదాగిన సామాచారముతో, నిన్న అనగా తేదీ: 03.07.2025 నాడు అందాజ 18.00 గం ల సమయములో ఈదులగుడ చౌరస్తా వద్ద బైక్ పై వెళ్తున్నా నిందితుడు -1 & 3 లను మరియు నిందితుడు -2 ను అతని నివాసము నందు పట్టుబడి చేయనైనది. నేరస్తులు అమాయకపు ప్రజలను మోసం చేయడానికి మొదటగా, రూ. 50/-, రూ. 100/- ల లక్కీ డ్రా స్కీమ్ లతో మొదలు పెట్టి నమ్మకము కుదిరిన తరువాత, రూ. 1000/- స్కీమ్ ను మొదలు పెట్టినారు. తదనుగుణముగా, అమాయకపు ప్రజలకు విలువైన వస్తువులను ఆశ చూపి, మోసపు మాటలతో ఆకర్షించి, కమిషన్ ల ఆశ చూపి ఏజెంట్ లను ఏర్పాటు చేసుకుని, వారి ద్వారా ఎక్కువ మందిని వారి లక్కీ డ్రా స్కీమ్ లో చేర్చుకుని, అందులోనుంచి సుమారు యాభై లక్షల రూపాయలతో సభ్యుల సమ్మకము కోసము, లక్కీ డ్రా గిఫ్ట్ ల రూపములో ఖర్చు చేయగా మిగిలిన RS: 1,36,79,000/- రూపాయలు నగదును దోచుకుని, ఇళ్ళు, ప్లాట్లు, ఖరీదైన ఇంటి సామాగ్రిని కొనుగోలు చేసి సుమ్మరు 1300 మండి బాధితులను మోసం చేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుటకు పధకము వేసినారు. ఈ సంధర్భముగా నల్లగొండ జిల్లా SP,శరత్ చంద్ర పవార్ IPS స్పందిస్తూ, ప్రజలు ఎవరు ఇటువంటి ముల్టీ లెవల్/లక్కీ డ్రా పేరిట ఏర్పాటు అయ్యే సంస్థలలో సభ్యులుగా చెరీ మోస పోరాదని, ఇట్టి సంస్థలు పూర్తిగా మోస పూరితమైనవని, ఇట్టి సంస్థలు ప్రజల సొమ్ముతో ఏజంట్లు, సబ్ ఏజంట్లను ఏర్పాటు చేసి కమిషన్ పేరు మీద డబ్బులు ఖర్చు చేసి సంస్థను స్థాపించి, చివరగా బోర్డు తిప్పివేసి ప్రజలను మోసము చేస్తారు. ఇటువంటి సంస్థల గురించిన సమాచారమును పోలీసు వారికి తెలియ చేయాలని, ఇటువంటి సంస్థలలో ఏజంట్ లు గా చేరిన వారు కూడా నేరస్థులౌతారని తెలియ చేసినారు. కావున ప్రజలు ఎవరు ఇటువంటి సంస్థలను నమ్మవద్దని సూచించినారు. నల్లగొండ జిల్లా ఎస్.పీ. శరత్ చంద్ర పవార్ IPS ఆదేశాల మేరకు, మిర్యాలగూడ DSP రాజశేఖర రాజు ఆధ్వర్యంలో ఈ కేసును చేధించిన – సీఐ, Ch.మోతీరామ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, మిర్యాలగూడ-1 టౌన్, ఎస్.ఐ. ఏ. సైదిరెడ్డి, కానిస్టేబుల్స్: N.శ్రీను, G. నర్సింహా, M. సైదులు, B. వీరబాబు, SK. తమీజుద్దీన్, R. సైదులు, B. ప్రసాద్ లను అభినందించారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *