Breaking News

వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా అయితే జాగ్రత్త…

వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ ద్వారా కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది అయితే కొందరు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లుగా అవతారం ఎత్తి వాహనదారులకు నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను అందజేస్తూ నిలువునా ముంచేస్తున్నారు.

ఇన్సూరెన్స్ చేయించినప్పుడు అది నకిలీ అని తెలియదు. కానీ క్లైమ్ కు వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా వాహనదారులు ఇబ్బందులు పడటమే కాకుండా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

రిలయన్స్ ఇన్సూరెన్స్ కు చెందిన కొంతమంది ఏజెంట్లు ఈ నకిలీ డాక్యుమెంట్లను గుర్తించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీల బాగోతం వెలుగు చూసింది.

నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను తయారు చేస్తూ వాహనదారులను మోసగిస్తున్న ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

నిందితులలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

గంజాయి నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్

శంషాబాద్ లో నకిలీ ఇన్సూరెన్స్ లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు.

నకిలీ వాహన బీమా పాలసీలు, ఆధార్, ఓటరు ఐడిలు, పాన్ కార్డులు తయారీ తోపాటు ఫోర్జరీలు చేస్తున్న ముఠా.

విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు SOT శంషాబాద్ బృందం శంషాబాద్‌లోని తొండుపల్లి (V)లో ఆకస్మిక దాడి నిర్వహించి, నకిలీ వాహన బీమా పాలసీలు మరియు ఆధార్, పాన్, గ్యాస్ బిల్లు, వాహన RC మొదలైన ఇతర ప్రభుత్వ పత్రాల తయారీ తోపాటు ఫోర్జరీలు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *