మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS నెత్రుత్వంలో ఈ నెల 19వ తేదీ ఉదయం 9:00 లకు గంగారం మండలం బాలికల ఆశ్రమ పాఠశాల నందు గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యోత్తమ మెరుగైన వైద్య సేవలు అందించుటకై నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంప్ సంబంధిచిన పోస్టర్ ను శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
19.01.2025. ఆదివారం రోజున గంగారం మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలయందు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పర్చి అనుభవగ్యూలైన గుండె, కంటి, చెవి ముక్కు, చర్మ మరియు వైద్యనిపుణులచే వైద్యం మరియు మందులు అందించడం జరిగితుంది అన్నారు.గంగారం, కొత్తగూడ, గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరు సద్వినియోగం చేసుకోగలరు అని కోరారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి, గూడూరు సీఐ బాబురావు, టౌన్ సీఐ దేవేంద, రూరల్ సీఐ సర్వయ్య, బయ్యారం సీఐ రవి, మరిపెడ సీఐ రాజకుమార్ అధికారులు పాల్గొన్నారు.