బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Telangana

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 18 ఫిర్యాదులు స్వీకరణ:జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 18 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.