బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Hyderabad

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు

రానున్న గణేష్ చతుర్థి పండుగ వేడుకలు, విగ్రహ నిమజ్జన ఊరేగింపులను పురస్కరించుకుని సికింద్రాబాద్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కీలక సమన్వయ సమావేశం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్-టీచింగ్ ఫంక్షనల్ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె. మూర్తి, ఐపీఎస్ అధ్యక్షత వహించారు. ఉత్సవాలను అత్యంత శాంతియుతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించడమే లక్ష్యంగా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో సమగ్ర సమీక్ష చేపట్టారు.

ఈ సమావేశంలో పోలీస్, జీహెచ్‌ఎంసీ, టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL), జలమండలి (HMWSSB), ఆర్ అండ్ బి (R&B), అగ్నిమాపక శాఖ మరియు 108 అత్యవసర వైద్య సేవల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల సమయంలో భక్తులకు కల్పించాల్సిన పౌర సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, సమస్యాత్మక ప్రాంతాల్లో బారికేడింగ్, ఊరేగింపు మార్గాల్లో రహదారుల మరమ్మతులు, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్య నిర్వహణ, అగ్నిమాపక భద్రత, అత్యవసర వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ మరియు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.

కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలన

ప్రధాన నిమజ్జన మార్గాల్లో భారీ విగ్రహాలు, వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా రోడ్లపై వేలాడుతున్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని జీహెచ్‌ఎంసీ హార్టికల్చర్ విభాగాన్ని డీసీపీ ఆదేశించారు. అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి, ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు నిబంధనలు పాటిస్తూ పోలీసు మరియు పౌర విభాగాలకు సహకరించి గణేష్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.