బ్రేకింగ్ న్యూస్
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలుధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ నియామకంఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్, మండల సర్వేయర్చాదర్‌ఘాట్‌లో మహిళ హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్ఆసియా మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నల్లగొండ ఏఆర్ కానిస్టేబుల్సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభంవరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షసెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్లు.. 35 మంది అరెస్ట్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంపోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలుధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ నియామకంఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్, మండల సర్వేయర్చాదర్‌ఘాట్‌లో మహిళ హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్ఆసియా మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నల్లగొండ ఏఆర్ కానిస్టేబుల్సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభంవరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షసెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్లు.. 35 మంది అరెస్ట్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి: రాఖీ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ హృదయపూర్వక రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలు పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరారు.

“చెల్లి కట్టే రాఖీ నీకు రక్షణ బంధం… నువ్వు ధరించే హెల్మెట్ నీ ప్రాణానికి రక్షణ కవచం. రాఖీ కట్టే చెల్లి కోసం మాత్రమే కాదు.. నీ కుటుంబం కోసం కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి” అని ఎస్పీ పరితోష్ పంకజ్ సందేశం ఇచ్చారు.

పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు

మహిళలు, బాలికల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎస్పీ తెలిపారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు, మహిళలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో షీ టీమ్స్ నిరంతరం నిఘా కొనసాగిస్తాయని చెప్పారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే జిల్లా షీ టీమ్ నంబర్ 8712656772కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి రాఖీ పౌర్ణమిని సురక్షితంగా జరుపుకోవాలని ఆయన కోరారు.