బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Telangana

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

సైబర్ జాకృత్క దివాస్ సందర్భంగా నల్గొండ మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమం
.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సైబర్ నేరాలు పలు రకాలుగా ఉంటాయని వాటిపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూ, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తూ మన నుండి డబ్బులను కాజేస్తారని వివరించారు. అలంటి వాటిని నమ్మకూడదని, ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలని, తదుపరి సమీప పోలీస్ స్టేషన్ ని సంప్రదించమని తెలియజేశారు.
నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, వాటిపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోకూడదని, ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి తప్ప, మరొక విధంగా వాడకూడదని, ముఖ్యంగా విద్యార్థినిలు వారి వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తులను ఫేస్బుక్లో గాని, ఇంస్టాగ్రామ్ లో గాని, మరి ఏ విధమైన సోషల్ మీడియా సైట్లలో స్నేహితులుగా యాక్సెప్ట్ చేయకూడదని, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లను అటెండ్ చేయకూడదని, అదేవిధంగా విద్యార్థులు బెట్టింగ్ యాప్ లకి దూరంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు మొదట డబ్బు ఆశ చూపి, తదుపరి మన ఫోన్లో ఉన్న డేటాను తస్కరించి, తద్వారా మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులను కొట్టేస్తారని వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది.అదే విధంగా ప్రతి సోమవారం సైబర్ నేస్తం కార్యక్రమంలో భాగంగా బాధితులు తమ సమస్యల పరిష్కారం కొరకు 87126 58079 కాల్ చేసి మీ సమస్యలు తెలుసుకోగలరని అన్నారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ, సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్సై సైదులు, సైబర్ క్రైమ్ సిబ్బంది రియాజ్, మోక్షిత్, ఫారుక్ మరియు మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్