బ్రేకింగ్ న్యూస్
వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షసెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్లు.. 35 మంది అరెస్ట్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షసెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్లు.. 35 మంది అరెస్ట్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Telangana

ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్

ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్

క్షేత్రస్థాయిలో పోలీసింగ్ బలోపేతమే లక్ష్యం

మహబూబాబాద్: ప్రజల విశ్వాసాన్ని పొందడం ద్వారా మాత్రమే సమర్థవంతమైన కమ్యూనిటీ పోలీసింగ్ సాధ్యమవుతుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కిట్‌లు, రికార్డులు, వివిధ గదులు, పరిసరాల పరిశుభ్రత, రిసెప్షన్‌లో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.

స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందితో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి విధి నిర్వహణ, డ్యూటీ సంబంధిత సమస్యలు, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి స్వేచ్ఛగా తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కేసుల దర్యాప్తు, CCTNSపై సమీక్ష

పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన రికార్డులు, CD Files, దర్యాప్తు పత్రాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, పెండెన్సీ, రికార్డుల నిర్వహణ, CCTNSలో వివరాల నమోదు, అప్‌డేషన్ తదితర అంశాలను సమీక్షించారు.

ప్రతి కేసు దర్యాప్తులో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను సేకరించాలని, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి, ప్రతి కేసుకు సంబంధించిన రిపోర్టులు, రికార్డులు, CD Files‌ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

SI రాజుతో కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల అప్‌డేషన్, CCTNS, VPOల పనితీరు తదితర అంశాలపై ఎస్పీ చర్చించారు.

VPOలతో గ్రామస్థాయిలో నిఘా బలోపేతం

VPOల పనితీరుపై ఎస్పీ ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రతి VPO తనకు కేటాయించిన గ్రామాన్ని నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, వారానికి కనీసం ఒకసారి గ్రామాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు.

గ్రామస్థాయిలో ప్రజల్లో పోలీసులపై నమ్మకం, భద్రతా భావన కలిగించేలా పనిచేయాలని సూచించారు.

వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

గంజాయి, గుడుంబాపై ప్రత్యేక నిఘా

గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, గుడుంబా, ఇతర అక్రమ మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. గుడుంబా తయారీ, అక్రమ విక్రయాలు, రవాణాపై నిరంతర దాడులు నిర్వహిస్తూ కఠినమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పటిష్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించారు.

ప్రజలతో నిరంతర అనుసంధానమే కీలకం

పోలీసింగ్ అనేది కేవలం పోలీస్ స్టేషన్‌కు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతర అనుసంధానంతో కొనసాగాలని ఎస్పీ తెలిపారు. నేరాల నియంత్రణలో ముందస్తు నిఘా, నిరంతర ఫీల్డ్ విజిట్స్ కీలకమని పేర్కొన్నారు.

CCTNSలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు. దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ పాటిస్తూ పెండింగ్ రిపోర్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించడంతో పాటు సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన సామర్థ్యాన్ని సమానంగా ప్రోత్సహించాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేస్తూ వారి విశ్వాసాన్ని పొందినప్పుడే సమర్థవంతమైన కమ్యూనిటీ పోలీసింగ్ సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో CI అంజలి, DSP తిరుపతిరావు, SI రాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గమనిక: మహబూబాబాద్ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో డా. శబరీష్. పి., ఐపీఎస్ జిల్లా ఎస్పీగా పేర్కొనబడ్డారు.