వికారాబాద్: ఇటీవల నిర్వహించిన వికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన పరిగి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి. రమేశ్ కుమార్ (HC-9238) గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి పోలీస్ అసోసియేషన్ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
సిబ్బందిలో ఐక్యత, సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసేలా ప్రోత్సహించాలని ఎస్పీ సూచించారు. పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు సిబ్బందికి, పోలీస్ శాఖకు మధ్య సమన్వయ వారధిగా పనిచేయాలని, శాఖ ప్రతిష్టను మరింత పెంచే విధంగా క్రమశిక్షణతో వ్యవహరించాలని అన్నారు.
నూతన అధ్యక్షుడు బి. రమేశ్ కుమార్ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా పి. నాగార్జున, కె. గిరన్న, జనరల్ సెక్రటరీగా పి. విట్టల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా జి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి. వేణుగోపాల్, ట్రెజరర్‌గా టి. నాగేష్ ఎన్నికయ్యారు.
యూనిట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కె. మహేశ్వర్ రెడ్డి, ఎం. శ్రీనివాస్ గౌడ్, వై. పండయ్య, కె. మీనా, ఎం.డి. అయూబ్, జి. రాఘవేందర్, కో-ఆప్షన్ సభ్యులుగా చి. నర్సిములు, బి. వెంకటేష్ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేశ్ మీనా, ఐపీఎస్, పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
