Breaking News

ఆయుర్వేద వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్.

కర్ణాటక రాష్ట్రనికి చెందిన అజయ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మోటర్ సైకిల్ పై సంచరిస్తూ పలు జిల్లాల్లోని గ్రామాలలోని అనారోగ్యానికి గురైన అమాయకమైన ప్రజల వద్దకు వెళ్లి వారికి ఉన్నటువంటి పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తూ ఆయుర్వేద వైద్య చికిత్స చేసి తగ్గిస్తాఅంటూ నమ్మించి ఆయుర్వేద వైద్య కోసం వారివద్ద నుండి పెద్ద మొత్తంలో 10వేల నుండి 50 వేల వరకు డబ్బులు వసూలు చేసి మళ్ళీ వచ్చి వైద్యం చేస్తా అంటూ వెళ్లిపోయేవాడు నమ్మ పలికి అక్కడి నుండి వెళ్లి పోయి అమాయకమైన ప్రజలను మోసం చేస్తుండవాడు.

తెలుగు రాష్ట్రాలలో అనంతపూర్,మహబూబ్ నగర్ , నారాయణఖేడ్ ,రంగారెడ్డి ,నిజామాబాద్,కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిందితుడు సంచరిస్తూ అమాయకమైన ప్రజలను ఆయుర్వేద వైద్యం పేరుతో మోసాలకు పాల్పడుతుండే వాడు అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణ పరిదిలోని శాత్రాజు పల్లి,ముస్తాబాద్ మండల పరిధిలోని బద్నకల్, వెంకట్రావుపల్లి మరియు గంభీరావుపేట్ మండలం లోని లింగాన్నపేట గ్రామనికి చెందిన కొడిమోజు లక్షమి w/o ప్రభాకర్ వద్దకు తేది: 12-11-2024 రోజున నిందితుడు వెళ్లి ఆమె భర్తకి పక్షపాతం ఉన్నదని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్లి ఆమెకి లేనిపోని మాయ మాటలు చెప్పి నీ భర్తకి పక్షపాతం నయం చేస్తా అని నమ్మించి ఆమె దగ్గర నుండి 20 వేల రూపాయలు ఫోన్ పే చేయించుకొని ఆమె వద్ద ఉన్న కొత్త దుబాయి దుప్పటను తీసుకొని మళ్ళీ వస్తా ఇంకా కొన్ని మందులు తెస్తా అని నమ్మించి అక్కడి నుండి వెళ్లి పోయినాడు. ఇలా వివిధ గ్రామాలలోని ప్రజలను నమ్మించి మొత్తం సుమారుగా 5 నుండి 6 లక్షల రూపాయలను మోసం చేసి మళ్ళీ ఈ రోజు ఎవరైనైన మోసం చేయడానికి ఉన్నరా అని గంభీరావుపేటలో తిరుగుచుండా పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తుండగా పోలీసు వారికి అనుమానం వచ్చి పట్టుకొని విచారించగా తెలంగాణ రాష్టంలో సుమారుగా 50 మందికి పైగా మోసం చేసాడని నిందితుడు ఒప్పుకొనగా నిందితుడిని రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది ASI శ్రీనివాస్ రెడ్డి, పిసి శ్రీనాథ్ లను డిఎస్పీ అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *