బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

నిజామాబాద్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి మొత్తం 33 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని, వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి వినతులు, ఫిర్యాదులను శ్రద్ధగా స్వీకరించాలని తెలిపారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, చట్ట ప్రకారం సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం ఉండాలని పేర్కొన్న ఎస్పీ, గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను నిరంతరం సమీక్షిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

గ్రీవెన్స్ డే కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా జిల్లా స్థాయి అధికారులను కలిసి తమ సమస్యలను వివరించే అవకాశం కలుగుతుందని, దీంతో సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా పోలీస్ శాఖను సంప్రదించాలని సూచించారు.

జిల్లా ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.