బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు జిల్లా పోలీస్ శాఖ శుభాకాంక్షలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు జిల్లా పోలీస్ శాఖ శుభాకాంక్షలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు జిల్లా పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈద్గా మైదానాలు, మసీదులు, ప్రార్థనా కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.

పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు, ప్రత్యేక పికెట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి మతసామరస్యంతో, శాంతియుతంగా బక్రీద్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వివాదాస్పద పోస్టులు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, అనుమానాస్పద సంఘటనలు లేదా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్