బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమీక్షించారు.

స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, క్రైమ్ ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరాల పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించిన ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విల్లేజ్ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామ స్థాయి సమాచార వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని తెలిపారు.

దొంగతనాలు, చోరీలు, ఇతర ఆస్తి నేరాల నివారణకు రాత్రి, పగలు పటిష్ట గస్తీ నిర్వహించాలని, ముఖ్యంగా హైవేలు, గ్రామ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను తరచుగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన ఎస్పీ, ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ తనిఖీలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ ఆది రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్‌ఐ సైదా బాబు తదితరులు పాల్గొన్నారు.