బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Telangana

హత్య కేసులో సంచలన తీర్పు.. 10 మంది నిందితులకు జీవిత ఖైదు

హత్య కేసులో సంచలన తీర్పు.. 10 మంది నిందితులకు జీవిత ఖైదు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పది మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ సోమవారం తీర్పు చెప్పారు. ప్రతి నిందితుడికి రూ.6,500 జరిమానా కూడా విధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు.

ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని, కఠిన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందిని అభినందించారు.

బోయినపల్లి మండలం స్థంబంపల్లి గ్రామానికి చెందిన తునికి మహేష్, అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మహేష్ ఇంటిపై దాడి చేశారు. కట్టెలు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో మహేష్ తండ్రి తునికి లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

మృతుడి భార్య తునికి విజయ ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

విచారణ దశలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు సిబ్బంది 20 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైందని తేల్చి 10 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.

కేసులో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీ పెంట శ్రీనివాస్, సీఐలు నవీన్ కుమార్, శ్రీనివాస్, సిఎంఎస్ ఎస్సై రవీందర్ నాయుడు, బోయినపల్లి ఎస్సై రమాకాంత్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, కోర్టు కానిస్టేబుళ్లు సరేష్, రాజేంద్ర ప్రసాద్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.