బ్రేకింగ్ న్యూస్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టినేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
Telangana

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

మిర్యాలగూడ: జిల్లాలో నేర నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో నమోదవుతున్న నేరాల తీరు, కేసుల దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై పోలీసు అధికారులతో ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జిల్లాలో నమోదైన కేసుల వివరాలను, వాటి దర్యాప్తు పురోగతిని ఎస్పీ సమగ్రంగా సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్ష పడే విధంగా పక్కా ఆధారాలను సేకరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు కేసుల పరిష్కారంలో నాణ్యత, నిర్ణీత కాలపరిమితిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

కేసుల దర్యాప్తును మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ‘ఈ-సాక్ష్య’ యాప్‌ను ప్రతి దర్యాప్తు అధికారి తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి సందేహాలకు తావులేకుండా కేసులకు సంబంధించిన ఆధారాలను పద్ధతిగా భద్రపరచాలని, కోర్టులో నిందితులకు శిక్ష పడేలా శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తును బలోపేతం చేయాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, కేసుల వివరాల నమోదు, దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య వంటి సాంకేతిక వ్యవస్థల వినియోగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయడంతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు.

నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, నేరాలు జరగకుండా ముందస్తు చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే స్పందించాలని తెలిపారు. బీట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికల గుర్తింపు, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నందున పట్టణాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన రహదారులు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును మరింత విస్తరించాలని సూచించారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, స్థానిక సంస్థల సహకారంతో మరిన్ని ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సాంకేతిక లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితుల డబ్బు ఇతర ఖాతాలకు బదిలీ కాకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు వీలైనంత త్వరగా నష్టాన్ని నివారించేలా సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. మాదకద్రవ్యాల సరఫరా గొలుసును గుర్తించి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా, ఇసుక అక్రమ తవ్వకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల అక్రమ తరలింపులను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సరిహద్దుల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను నిరంతరం తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యలను సానుకూలంగా విని, చట్టపరమైన పరిధిలో సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ సూచించారు. బాధితుల ఫిర్యాదులపై ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా స్పందించాలని, ప్రజలకు న్యాయం అందించే విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణ, నేరాల ఛేదన, కేసుల దర్యాప్తు, కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెంపుపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, శాస్త్రీయ దర్యాప్తు విధానాలను అవలంబించి ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేలా ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శ్రీనివాస్ రావు, రవి కుమార్, లక్ష్మి నారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.