బ్రేకింగ్ న్యూస్
మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలుఐ.ఎస్. సదన్‌లో అక్రమ జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడికురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలుఐ.ఎస్. సదన్‌లో అక్రమ జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడికురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్
Telangana

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్

నల్లగొండ: కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపల్‌ను హత్య చేసింది ఆమె వద్ద చదువుకున్న ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. గంజాయికి అలవాటు పడటంతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

ఈ నెల 11న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఆమె స్కూల్ నుంచి ఇంటికి చేరుకునేలోపే నిందితులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి, వంటగదిలో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి ఇంటి తాళం తీసుకుని లోపలికి వెళ్లిన తర్వాత ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగా.. నిందితులు వెనుక నుంచి వచ్చి కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ దాడిలో రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న సుమారు రూ.2 లక్షలను తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు.

మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

హత్య అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించేందుకు, సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తీసుకెళ్లిన డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి చివరకు ఇద్దరు పదో తరగతి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.