బ్రేకింగ్ న్యూస్
మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలుఐ.ఎస్. సదన్‌లో అక్రమ జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడికురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలుఐ.ఎస్. సదన్‌లో అక్రమ జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడికురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్
Telangana

‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీ

‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీ

కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన నల్లగొండ పోలీసులు

నల్లగొండ, ఆగస్టు 19: కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. దోపిడీ కోసం హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించగా, ఈ కేసులో పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు 16 ఏళ్ల బాలురను అదుపులోకి తీసుకున్నారు.

కేసు దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను కీలకంగా ఉపయోగించిన పోలీసులు సుమారు రూ.1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

క్రైమ్ నంబర్ 150/2026, సెక్షన్ 103 BNS కింద కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆగస్టు 11న రూపారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.

కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సవాలుగా తీసుకుని దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్‌ప్రింట్లు, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలు తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టారు.

హత్య జరిగిన ప్రాంతం చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 360 డిగ్రీల కోణంలో పరిశీలన నిర్వహించి సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. ఐదు ప్రత్యేక బృందాల్లో సుమారు 40 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేసి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.

‘బాబు’ అనే ఒక్క మాటతో కీలక మలుపు

రూపారెడ్డి హత్యకు ముందు తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడిన సమయంలో చివరిగా “బాబు” అని పలికినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ‘బాబు’ అంటూ ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు.

దర్యాప్తులో రూపారెడ్డి పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా ‘బాబు’ అని పిలిచేవారని గుర్తించారు. దీంతో దర్యాప్తు పాఠశాల విద్యార్థుల వైపు మళ్లింది.

పాఠశాలకు వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు ఉండటంతో విద్యార్థుల విచారణలో కొంత ఆలస్యం జరిగింది. పాఠశాల పునఃప్రారంభమైన అనంతరం పోలీసులు విద్యార్థులను ఒక్కొక్కరిని విచారిస్తూ అనుమానితుల కదలికలను పరిశీలించారు.

రెండు రోజులుగా పాఠశాలకు హాజరుకాని కొంతమంది విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర ఆధారాలను విశ్లేషించిన అనంతరం ఇద్దరు పదో తరగతి విద్యార్థులపై అనుమానం బలపడింది.

రూ.1.54 లక్షల నగదు స్వాధీనం

బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో దొనియాల ‘X’ రోడ్ వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనిఖీల్లో వారి వద్ద నగదు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగదులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారించగా, ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య అనంతరం ఇంటి నుంచి నగదును అపహరించినట్లు బాలురు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

సోషల్ మీడియా ప్రభావంతో హత్యకు ప్రణాళిక?

పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఇద్దరు బాలురు ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతూ హాస్టల్‌లో ఒకే గదిలో ఉండేవారు. జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి, తల్లిదండ్రులకు తెలియకుండా సెల్‌ఫోన్లు వినియోగించేవారని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియా, యూట్యూబ్‌లో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను వెతికినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో హాస్టల్‌లో డబ్బులతో పట్టుబడిన సందర్భంలో ప్రిన్సిపల్ వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్లు తెలిపారు.

ప్రిన్సిపల్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించిన ఇద్దరు బాలురు హత్యకు ముందే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.

ముందస్తు ప్రణాళికతో హత్య

పోలీసుల ప్రకారం, హత్యకు ముందు ఇద్దరు బాలురు ప్రిన్సిపల్ ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి బ్యాగులో నుంచి ఎరుపు రంగు హుడీ, ప్యాంట్ తీసుకుని వచ్చారు. అనంతరం కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు.

రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని, ఒకరు బయట ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తుండగా మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. తెరిచి ఉన్న వంటగది ద్వారా ఇంట్లోకి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదులో కొంత మొత్తాన్ని తీసుకుని ఇంటి వెనుక గోడ దూకి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్‌ఫోన్‌ను చెట్ల పొదల్లో పడేసి, కొంత దూరంలో బట్టలు మార్చుకున్నారని తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

పోలీసులు బాలుర నుంచి:

  • రూ.1.54 లక్షల నగదు
  • మృతురాలి ఐఫోన్
  • హత్యకు ఉపయోగించిన కత్తి
  • చేతి గ్లౌజులు
  • మాస్కులు
  • రెండు సెల్‌ఫోన్లు

స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసు బృందాలకు ఎస్పీ అభినందనలు

కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాసరావు, మల్లెపల్లి సీఐ ఎ. నవీన్ కుమార్, CCS ఇన్‌స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, మల్లెపల్లి ఎస్‌ఐ ఎ. రమేష్, చింతపల్లి ఎస్‌ఐ ఎం. రామ్మూర్తి, గుడిపల్లి ఎస్‌ఐ డి. నరసింహులు, గుర్రంపొడు ఎస్‌ఐ ఎన్. వెంకన్న, CCS ఎస్‌ఐ యు. సురేష్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులు ప్రకటించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కేసులో లభించిన ప్రతి చిన్న ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందాల కృషి అభినందనీయమన్నారు. నేరస్తులు ఎంత తెలివిగా వ్యవహరించినా శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయంతో దర్యాప్తు చేస్తే నేరాలను ఛేదించవచ్చని తెలిపారు.