బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Telangana

మహబూబాబాద్‌లో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా

మహబూబాబాద్‌లో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా

రైతులకు ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణ : జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్ జిల్లాలో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ధాన్యం రవాణా ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

గురువారం నెల్లికుదురు మండల పరిధిలోని ఆలేరు గ్రామంలోని మణికంఠ రైస్ ఇండస్ట్రీస్ (రైస్ మిల్), మునిగలవీడు, నెల్లికుదురు గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్‌తో కలిసి జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న ధాన్యం, మక్కజొన్న కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, లిఫ్టింగ్, రవాణా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ధాన్యం రవాణా సమయంలో అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు, నిల్వ ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేయాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్

ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించి రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాలు, రవాణా శాఖలతో పాటు పోలీస్ శాఖ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే రైస్ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ పర్యటనలో డీఎస్పీ తిరుపతి రావు, సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.