బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Telangana

ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో గంభీరవుపేటలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ

ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో గంభీరవుపేటలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ

సిరిసిల్ల జిల్లా గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం పర్యటనను పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. మంగళవారం జరగనున్న ఈ పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలోని ఏర్పాట్లను, ముఖ్యంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, అన్ని విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, వీఐపీ మువ్‌మెంట్ సమయంలో ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా సిబ్బంది మోహరింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై కఠిన నిఘా ఉంచాలని, ప్రతి బిందువులో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

ఈ తనిఖీల్లో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, ఎల్లారెడ్డిపేట సి.ఐ వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ రవి, ఆర్.ఐలు మధుకర్, రమేష్, ఎస్‌.ఐ అనిల్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.