జిల్లాలో పోలీస్ లు అందిస్తున్న సేవలపైన ప్రజల అభిప్రాయం తెలుపుట జిల్లా పోలీసు కార్యాలయంలో సిటిజెన్ ఫీడ్ బ్యాక్ QR కోడ్ కలిగిన పోస్టర్ ను జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ల సేవలు వారి పని తీరు అనగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు తీసుకొనుట, FIR నమోదు చేయుట, ఈ చాలన్ (ట్రాఫిక్ ఉల్లంఘన) పాస్ పోర్ట్ దృవీకరణ, మరియు ఇతర అంశాల పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఇక నుంచి QR కోడ్ ద్వారా తెలియపరచవచ్చునని జిల్లా ఎస్పి తెలిపారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క QR కోడ్ తో కలిగిన పోస్టర్ అందుబాటులో ఉంటాయని ఎవరికైనా పోలీస్ లు అందిస్తున్న సేవల పైన అభిప్రాయాలు తెలియజేయాలి అంటే QR కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాన్ని తెలియజేయండి అని అన్నారు. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయుటకు ముందుగా QR కోడ్ స్కాన్ చేసి https://qr.me-qr.com/aZMTxHDm లింక్ ఓపెన్ చేసి అందులో తెలపబడిన విధంగా మీ అభిప్రాయాలు తెలపాలని కోరారు.
