బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

నకిలీ PhonePe స్క్రీన్‌షాట్‌లతో ATM మోసాలు – నిందితుడు అరెస్ట్, రూ.10,000 స్వాధీనం

నకిలీ PhonePe స్క్రీన్‌షాట్‌లతో ATM మోసాలు – నిందితుడు అరెస్ట్, రూ.10,000 స్వాధీనం

వార్త:
హైదరాబాద్‌లో ATM సెంటర్ల వద్ద నకిలీ PhonePe యాప్ స్క్రీన్‌షాట్‌లతో అమాయకులను మోసం చేస్తున్న నిందితుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏప్రిల్ 17, 2026న వెలుగులోకి వచ్చింది.

చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ATM వద్ద అబ్దుల్ నాసర్ అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ చేస్తుండగా, నిందితుడు అబ్దుల్లా ఒబైద్ అల్ కతేరి (25) అతడిని సంప్రదించాడు. అత్యవసరంగా నగదు అవసరమని చెప్పి, తన వద్ద ఉన్న డబ్బును ఫోన్ పే ద్వారా పంపిస్తానని నమ్మబలికాడు. అనంతరం నకిలీ యాప్ ద్వారా డబ్బు పంపినట్లు తప్పుడు స్క్రీన్‌షాట్ చూపించి బాధితుడి నుంచి నగదు తీసుకుని పరారయ్యాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్లు 303(2), 318(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడు ఇదే తరహాలో పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడు.

పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు మొత్తం నాలుగు కేసుల్లో రూ.46,000 మేర మోసం చేసినట్లు గుర్తించారు. వీటిలో చాంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్ ప్రాంతాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఒక కేసులో రూ.10,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ అభినందించారు. ఆయన మార్గదర్శకత్వంలో చాంద్రాయణగుట్ట ఏసీపీ ఎ. సుధాకర్, ఎస్‌హెచ్‌ఓ ఆర్. గోపి, డీఐ బి. రామస్వామి, ఎస్‌ఐలు జె. కిరణ్ కుమార్, వి. శ్రీనివాసరావు, ఎస్. చంద్రారెడ్డి తదితరులు నిందితుడిని తక్కువ సమయంలో గుర్తించి పట్టుకున్నారు.

ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు సిబ్బందికి తగిన బహుమతులు అందజేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.