Breaking News

ఇసుక ఫిల్టర్ స్థావరాలపై సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

• సుమారు 6 కోట్ల విలువ గల ప్రాపర్టీ సీజ్..
• పోలీసుల అదుపులో 32- మంది వ్యక్తులు.
• వివరాలు వెళ్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం మేరకు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట్, బ్యాతోల్ గ్రామ శివారులలో కొంత మంది ఆక్రమార్కులు ఇసుక ఫిల్టర్ స్థావరాలను ఏర్పాటు చేసుకొని, భూసారాన్ని తగ్గించే విధంగా మట్టిని తవ్వి, అందులోంచి ఇసుకను వడకడుతూ అక్రమ ఇసుక దందాలకు పాల్పడుతున్నారని, ఈ రోజు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్పెషల్ పార్టీ టీమ్స్ రెండు బృందాలుగా ఏర్పడి ఇస్మాయిల్ ఖాన్ పేట్, బ్యాతోల్ గ్రామ శివారులో గల ఇసుక ఫిల్టర్ స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు.


ఈ దాడులలో.. ఇస్మాయిల్ ఖాన్ పేట్ గ్రామ శివారులో గల ఇసుక ఫిల్టర్ వద్ద 3-ఇటాచీలు, 2- జేసీబీలు, 5- ట్రాక్టర్, ట్రాలీ, 10-ట్రాక్టర్ ఇంజెన్స్, బ్యాతోల్ గ్రామ శివారులో గల ఇసుక ఫిల్టర్ వద్ద 3-ఇటాచీలను సీజ్ చేయడంతో పాటు మొత్తం 32 మందిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కొరకు సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎవరైనా అక్రమ ఇసుక ఫిల్టర్ స్థావరాలను ఏర్పాటు చేసినట్లు తెలిస్తే ఆ వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

ఈ టాస్క్ ను విజయవంతం చేసిన టాస్క్ఫోర్స్ సిబ్బందికి మరియు స్పెషల్ టీమ్స్ కు జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *