బ్రేకింగ్ న్యూస్
కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతకురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రత
Uncategorized

ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీస్.

నల్లగొండ పట్టణ కేంద్రంలో మెడికల్ కాలేజ్‌లో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో జిల్లా యస్పి మాట్లాడుతూ, “ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలి” అని, తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మేల్కొనాలని, సీనియర్లు, జూనియర్లు అని బేదం వీడనాడుతూ, “నేటి సీనియర్లు ఒకప్పుడు జూనియర్లు” అనే విషయం మరచిపోవద్దు” అని అన్నారు. తోటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం, ర్యాగింగ్‌కు పాల్పడితే ఒకసారి కేసు నమోదైతే, 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. ర్యాగింగ్ అనగా వ్యక్తులను, మానసికంగా లేదా శారీరకంగా అవమానపరచడం, భయపెట్టడం, భయం కలిగేటట్లు చేయడం, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అనర్దాలు జరుగుతాయని, చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయని, ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేయబడతాయని చెప్తూ, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తూ “ర్యాగింగ్ అనే భూతాన్ని కళాశాల నుండి తరిమేయాలని” సూచించారు. ఎంతో కష్టపడి చదివి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకొని ర్యాగింగ్ అనే క్షణిక పాశవిక ఆనందానికి చేస్తే, కేసులు నమోదై, జైలు కి వెళ్తే వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కూడా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి నల్గొండ కె శివరాం రెడ్డి, ఎస్బి సిఐ రాము,వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై సైదులు కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయం