బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
Telangana

వికారాబాద్ పట్టణంలో సమస్యల మయం: ప్రజల ఆవేదన, అధికారుల నిర్లక్ష్యం?

వికారాబాద్ పట్టణంలో సమస్యల మయం: ప్రజల ఆవేదన, అధికారుల నిర్లక్ష్యం?

వికారాబాద్ పట్టణంలో రోజు రోజుకు పలు సామాజిక, మౌలిక సమస్యలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైకిళ్ల నుంచి ఆటోల వరకు చోరీలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం దొంగతనాలు, రేషన్ బియ్యం అక్రమ విక్రయాలు కూడా చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో గంజాయి సరఫరా జరుగుతోందనే ఆరోపణలు, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహణ ప్రజా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పట్టణంలోని వైన్ షాపుల ముందు మద్యం సేవించి రోడ్లపై పడుకునే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఒక కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోందని ఆరోపణలు వస్తుండగా, ఈ అంశంపై CITU నాయకుడు మహిపాల్ ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు సమాచారం. ఇది విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

వికారాబాద్ ప్రభుత్వ కొత్త ఆసుపత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. పట్టణంలో సీసీ కెమెరాల వ్యవస్థ సరిగా లేకపోవడం, రోడ్లపై దుమ్ము, గుంతలు తీవ్ర సమస్యగా మారాయి. మునిసిపల్ పరిధిలో చెత్త సేకరణ, వాహనాలకు డీజిల్ వినియోగంపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం

ఇదిలా ఉండగా, అసైన్మెంట్ మరియు ఈనామ్ భూములపై కొంతమంది ప్రభావశీలుల కన్ను ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద వికారాబాద్ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతుందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అయితే, ఈ సమస్యలన్నీ తెలిసినా పట్టణ ప్రజలు పెద్దగా స్పందించకపోవడం, పోరాటాలు చేయకపోవడం, ప్రశ్నించకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా కొందరు అభిప్రాయపడుతున్నారు. “మా పని మాకు సాగితే చాలు” అనే ధోరణి మారితేనే పట్టణంలో మార్పు సాధ్యమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.