బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Telangana

“మన గ్రామం – మన బాధ్యత” కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్

“మన గ్రామం – మన బాధ్యత” కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్: గ్రామ భద్రత, రోడ్డు భద్రత మరియు గంజాయి నిర్మూలన లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల నిర్వహించిన సమావేశంలో భాగంగా జిల్లాలోని 42 గ్రామపంచాయతీలు, 13 మున్సిపల్ వార్డులను ఎంపిక చేసి “మన గ్రామం – మన బాధ్యత” అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయడంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది గ్రామాల్లో డోర్ టు డోర్ సర్వే నిర్వహించి హెల్మెట్ వినియోగంపై సమాచారం సేకరించి, అవసరమైన వారికి హెల్మెట్లు పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి హెల్మెట్ లేకుండా గ్రామాలు, వార్డుల్లోకి ప్రవేశం ఉండదని తీర్మానాలు చేస్తున్నారు.

గ్రామాలు, వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కూడా ముందడుగు వేస్తున్నారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని గుర్తించి పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, సర్పంచులు మరియు కౌన్సిలర్లు పోలీస్ శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, సీసీ కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. గ్రామాల్లో మాదకద్రవ్యాలకు స్థానం లేకుండా చేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

పోలీస్ శాఖతో కలిసి పనిచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సర్పంచులు, కౌన్సిలర్లు మరియు పోలీస్ సిబ్బంది కృషిని ఎస్పీ అభినందించారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

“హెల్మెట్ మన రక్షణ – మన గ్రామ భద్రత మన చేతుల్లోనే”, “మన గ్రామం – మన బాధ్యత” అనే నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.