బ్రేకింగ్ న్యూస్
చోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Uncategorized

తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్ విభాగం, లాక్ అప్, ఎస్.హెచ్.ఓ గది తదితర విభాగాలను జిల్లా ఎస్పీ పరిశీలించి,స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న మరియు నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులను సమగ్రంగా తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ఎటువంటి అలసత్వం వహించరాదని సూచించారు. దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్రంగా విచారణ చేసి, చట్ట ప్రకారం నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. గ్రామ పోలీసు అధికారులు ప్రతిరోజూ తమ పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై నేర నియంత్రణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజా ఫిర్యాదులపై ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణ స్పందన చూపాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బ్లూ కోల్ట్ మరియు పెట్రో కార్ విధుల్లో ఉన్న సిబ్బంది డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరితగతిన చేరుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్రోలింగ్ సమయంలో స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజూ తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి సారించి, మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్ మరియు డయల్ 100 సేవల వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే, అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా, జూదం వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, తిప్పర్తి ఎస్.ఐ శంకర్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి