బ్రేకింగ్ న్యూస్
చోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Uncategorized

రాజీ పడదగిన అన్ని కేసుల్లో కక్షిదారులు పరస్పర సమ్మతితో రాజీ కుదుర్చుకోవచ్చు – జిల్లా ఎస్పీ.

ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని తెలిపారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండి, జీవితాలను ఇబ్బందులకు గురి చేయకూడదని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నమోదై, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరియు రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీ పడేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ పడదగిన కేసులు: క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు తదితరాల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీ కుదుర్చుకోవచ్చు. సైబర్ నేరాల విషయంలో, బాధితులు కోల్పోయిన డబ్బులను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూ.25,000/- కంటే తక్కువ మొత్తాన్ని కోల్పోయిన సందర్భంలో లోక్ అదాలత్ లో ఫిర్యాదు చేసి, కోర్ట్ అనుమతితో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే రీఫండ్ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన మరియు సులభమైన పరిష్కారం లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి