బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

డైల్ 100కు వెంటనే స్పందించి బాధితులకు త్వరిత సేవలు అందించాలి .

డైల్ 100కు వెంటనే స్పందించి బాధితులకు త్వరిత సేవలు అందించాలి .

జిల్లా పోలీస్ అదికారులతో నేర సమీక్షా సమావేశం

జిల్లాలో నేర నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

డైల్ 100కు వెంటనే స్పందించి బాధితులకు త్వరిత సేవలు అందించాలి .

జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించి వాటిని సమర్థవంతంగా అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అదికారులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశించారు.

బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న నేరాల పరిస్థితి, పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు పురోగతి, కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్షలు పడేలా చేపడుతున్న చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల సమస్యలకు పోలీసులు వెంటనే స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా డైల్ 100 కు వచ్చే కాల్స్‌పై వెంటనే స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల విశ్వాసం పెంపొందేలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పోలీసు సేవలు అందించాలని తెలిపారు.

జిల్లాలో పెరుగుతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు మరింత పెంచాలని సూచిస్తూ, నేరాల గుర్తింపు మరియు విచారణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారికి నాణ్యమైన, సత్వర పోలీసు సేవలు అందించాలని సూచించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు మరియు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లాలో దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని, రౌడీ షీటర్లు, అనుమానితులు, పాత నేరస్థులపై కఠిన నిఘా కొనసాగించాలని సూచించారు.

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే అక్రమ గంజాయి రవాణా, జూదం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అదేవిధంగా బాధితుల గౌరవం, హక్కులను కాపాడుతూ వృత్తిపరమైన సేవలు అందించడమే లక్ష్యంగా, ఏదైనా నేరం జరిగిన వెంటనే బాధితులు ఫోన్ ద్వారా లేదా మౌఖికంగా సమాచారం అందిస్తే మహిళలు, చిన్నారులు తదితర బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే వారి ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమల్లోకి తీసుకువచ్చిందని ఎస్పీ తెలిపారు.

మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాలు, పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాల నిషేధ చట్టం, దొంగతనం, ర్యాగింగ్ నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ఈ విధానం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.