బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

మహిళల, విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పిస్తున్న జిల్లా షీ టీం, పోలీస్ అక్క.

జిల్లాలోని విద్యాసంస్థలలో,మహిళలు పని చేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు.
గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై మూడు కేసులు,08 పెట్టి కేసులు నమోదు.
వేధింపులకు గురైతే వెంటనే షీ టీం 87126 56425 ,లేదా పోలీస్ అక్కకు పిర్యాదు చేయండి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్., జిల్లాలో మహిళల ,విద్యార్థుల రక్షణయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన షీ టీం, పోలీస్ అక్క లు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ , పొక్సో, ర్యాగింగ్, ఈవ్ టీసింగ్,వేధింపులకు గురైతే ఎవరిని సంప్రదించాలి అనే మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల,విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పించడం జరుగుతుంది. గడిచిన నెల రోజుల వ్యవధిలో పోలీస్ అక్క అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యాసంస్థలలో 134 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లాలో విద్యార్థిని,మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై 03 కేసులు,08 పెట్టి కేసులు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి లేదా పోలీస్ అక్కకు ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలుఅపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు. మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా మీ పరిధిలోని పోలీస్ అక్కకు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు. జిల్లాలో విద్యాసంస్థల వద్ద షీ టీం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి బైక్ లపై ట్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విద్యార్థినులకు ఇబ్బందులు గురి చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్