
యూత్ ఫర్ సేవ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా కోటా కరుణాకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షీ టీమ్ & ఉమెన్ పి.ఎస్ హాజరై విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి మాట్లాడుతూ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసం,ఆరోగ్య దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వాడకం పట్ల కలిగే అనర్ధాలను గూర్చి అవగాహన కల్పించడం జరిగింది. అదే విధంగా ర్యాగింగ్ పై సైబర్ నేరాల పట్ల విద్యార్ధులకు అవగాహన కల్పించడం జరిగింది.
