
3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS. కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగిన ఈ క్రీడా సమారోహం లొ మహబూబాబాద్ జిల్లా నుండి పాల్గొన్న క్రీడాకారులు 04-స్వర్ణం, 04-రజత మరియు 04-కాంస్యం పతకాలు సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS తమ ఛాంబర్ లో అభినందించారు. నేషనల్ లో సెలక్ట్ అయినా వారు అక్కడ కూడా ప్రతిభ కనబరచి పతకాలు సంధించాలి అని అన్నారు. క్రీడాకారుల విజయాలు పోలీస్ శాఖలో స్ఫూర్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని, క్రీడలు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని, క్రీడా స్ఫూర్తి పోలీస్ అధికారుల మధ్య ఐక్యతను పెంపొందించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. అదనంగా, క్రీడాకారులు తమ కృషి మరియు పట్టుదలతో సాధించిన విజయాలు పోలీస్ శాఖకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, ఆర్.ఐలు భాస్కర్,అనిల్, ఆర్.ఎస్.ఐ శేఖర్, సునందా సిబ్బంది పాల్గొన్నారు.
