బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
International

నిద్రలో నుంచి లేచిన ట్రంప్ కాక

నిద్రలో నుంచి లేచిన ట్రంప్ కాక

అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ శుభాకాంక్ష‌లు
ఓట‌మి త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ విషెస్‌
ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న జ‌ట్టుకు అభినంద‌న‌లు
సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డి
లేటుగా స్పందించినందుకు పేలుతున్న జోకులు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ జ‌ట్టు ఒక మ్యాచ్ ఆడ‌టం అయ్యింది.. ఓడ‌టం కూడా జ‌రిగింది. ఈ నేప‌త్యంలో ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ చాలా లేట్‌గా నిద్ర‌లేచిన‌ట్టుంది.

వారి జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొంటున్న విష‌యం చాలా లేట్ తెలుసుకొని.. లేట్‌గా స్పందించారు.

శనివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది.

ఓడిపోయిన జట్టుకు, అది కూడా మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వారి జ‌ట్టుకు శుభాకాంక్షలు చెప్పారు. తమ క్రికెట్ టీమ్‌కు అమెరికా మొత్తం అండగా నిలుస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ‘

భారత్‌ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోందని ఇప్పుడే తెలిసింది. ఈ టోర్నీలో ఆడుతున్న అమెరికా జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. మన దగ్గర బలమైన జట్టు ఉంది, దేశమంతా మీ వెంటే ఉంది.’అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

57% మార్కుల నుంచి ఐపీఎస్‌ వరకు.. సమీర్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రయాణం

అయితే ఈ టోర్నీ ప్రారంభమై 24 గంటల తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

అంతేకాకుండా అమెరికా తమ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాత ట్రంప్ విషెస్ చెప్పడంపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి.

అయితే అమెరికా టీమ్ శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియాకు చుక్కలు చూపించింది. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాణించ‌డంతో భారత్ 161 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.

ట్రంప్ విషెస్ ఆలస్యమైనా.. అమెరికా జట్టు ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.