సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు..
• సైబర్ జాగ్రుకత దివాస్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..
• సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ఒక్కటే ముఖ్యమైన మార్గం..
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్

ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. సైబర్ నేరాలను నియంత్రించడానికి, ప్రజలలో సైబర్ భద్రతపై అవగాహన పెంచడానికి జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగ్రుకత దివాస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో ఆరు వారాల ప్రత్యేక కార్యచరణను రూపొందించడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
6-వారాల కార్యాచరణ:
మొదటి వారం: సైబర్ సారధి – సైబర్ హెల్ప్‌లైన్ 1930 ప్రాముఖ్యత: సైబర్ మోసానికి గురైనట్లయితే గోల్డెన్ హవర్ (మొదటి గంట లోపు / వీలైనంత తొందరగా) 1930 కు కాల్ చేసి సమాచారం అందించాలి.
రెండవ వారం: స్కామ్ సే బచావ్ – డిజిటల్ అరెస్ట్, లైంగిక బ్లాక్‌మెయిల్, సైబర్ స్లేవరీ.
మూడవ వారం: పైసా పైలమ్ – బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ (స్టాక్స్ బేస్డ్, టాస్క్ బేస్డ్), లోన్ ఫ్రాడ్, గిఫ్ట్ ఫర్డ్, అడ్వటైజమెంట్ ఫ్రాడ్, రివార్డ్స్ పాంయిట్ ఫ్రాడ్.
నాల్గవ వారం: హర్ స్కీన్ సురక్షిత్ – మొబైల్, కంప్యూటర్ భద్రత: హాకింగ్, ఫేక్ యాప్, ఎపికె లింక్, బెట్టింగ్, గేమింగ్.
ఐదవ వారం: మేరా లాగ్-ఇన్ మేరా రూల్ – సురక్షిత పాస్‌వర్డ్‌లు మరియు లాగిన్ నియమాలు.
ఆరవ వారం: మహిళల రక్షణ పిల్లల సంరక్షణ: డేటింగ్ యాప్, సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్, మాట్రిమోనియాల ఫ్రాడ్స్, చైల్డ్ సెక్సుయల్ ఫ్రాడ్.

ఇలాంటి అంశాలతో ప్రజల ముందుకు వెళ్ళి, సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు తేది: 03.12.2025 నాడు సంగారెడ్డి పట్టణంలోని ఇస్టా కళాశాలలో సైబర్ సారధి – సైబర్ హెల్ప్‌లైన్ 1930 గురించి అవగాహన కల్పిస్తూ.., సైబర్ మోసానికి గురైనట్లయితే గోల్డెన్ హవర్ అనగా వీలైనంత తొందరగా 1930 కు కాల్ చేసి సమాచారం అందించాలని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అన్నారు.
అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను వినిపించి కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనవసర లింక్ లను, , ఎపికె ఫైల్స్ ఓపెన్ చేసి, ఇబ్బందులకు గురి కావొద్దని అన్నారు. బ్యాంక్ అధికారులం అని, పోలీస్ అధికారులం అని, డిజిటల్ అరెస్ట్ అని, ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చే స్కామ్ కాల్స్‌కు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.., సైబర్ మోసం అని గుర్తించిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కి ఫిర్యాదు చేయాలన్నారు.
