Breaking News

హైదరాబాద్ సిటీ పోలీస్ మెగా రివార్డ్ కార్యక్రమం.

హైదరాబాద్ సిటీ పోలీస్ 2024 సంవత్సరానికి గాను మెగా రివార్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినారు. 2024 సంవత్సరంలో కేసులను గుర్తించడం మరియు పరిష్కరించడంలో గణనీయమైన కృషి చేసిన 706 మంది అధికారులు/సిబ్బంది గుర్తించబడ్డారు, ఇందులో (6- అదనపు డిసిపిలు, 13-ఎసిపిలు, 73-ఇన్‌స్పెక్టర్లు, 83-ఎస్ఐలు, 12-ఎఎస్ఐలు, 86-హెడ్ కానిస్టేబుళ్లు, 334 – పోలీస్ కానిస్టేబుల్స్, 29-హోమ్ గార్డ్స్, 64 మినిస్టీరియల్ సిబ్బంది మరియు 6- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు)ఉన్నారు.
ప్రస్తుత తరుణంలో CCS మరియు సైబర్ క్రైమ్‌ పోలీసులు ధీటుగా ఎదురు కుంటున్నసవాళ్ళను పరిగణనలోకి తీసుకుని, ఈ స్పెషల్ వింగ్స్ చేసిన మంచి పనిని గుర్తించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ట్రోఫీని ఏర్పాటు చేయడం జరిగింది.
2024 సంవత్సరానికి గాను సిసిఎస్ విభాగంలో ఉత్తమ దర్యాప్తు బృందం వై. హరీష్ కుమార్, ACP, EOW టీమ్ – I, డి. రాంబాబు, ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలు S. రవి కుమార్, బి. జయంత్ లకు కమీషనర్ ట్రోఫీని అందించారు. మరియు సైబర్ క్రైమ్స్‌లో, ఉత్తమ దర్యాప్తు బృందానికి ఎంపికైన కె.మధుసూధన్‌రావు ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐలు కె.వెంకటేష్‌, సిహెచ్‌ .మహిపాల్, ఎ.మాధవి లకు కమిషనర్ ట్రోఫీని అందించారు . ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న అహర్నిశల కృషిని అభినందించారు. 80 లక్షల జనాభాతో వివిధ రకాల నేరస్తులు, వారందరికీ న్యాయం చేయడం అసాధ్యమైన పని అయినప్పటికీ మన పోలీసులు అందులో రాణిస్తున్నారని అన్నారు. మనము ప్రతిరోజూ ఏదో ఒక బందోబస్త్ / భద్రతా ఏర్పాట్లతో చాలా బిజీగా ఉంటాము. నగరంలో ఎప్పుడు ఎలాంటి నేరాలు జరిగినా ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి కేసులను సత్వరమే పరిష్కరిస్తున్నాం. మనము జట్టుగా కలిసి చేసిన ప్రయత్నాల వల్లనే హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రశంసలు అందుకోవడంతోపాటు దేశంలోనే చెప్పుకోదగ్గ ఖ్యాతిని ఆర్జిస్తున్నారు. మన పోలీసులు తమ విధుల పట్ల అంకితభావంతో, అలుపెరగని కృషి వలనే సమాజంలో శాంతి మరియు ప్రశాంతతకు మార్గం సుగమం అయింది.
మన నగరంలో జనాభా అతి వేగంగా పెరుగుతున్నది. మరియు 24/7 వ్యాపారాలు సముదాయాలు మరియు అర్థరాత్రుల వరకు కూడా ప్రజలు రోడ్లపై సంచరించడం జరుగుతుంది అని పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. మనము కేవలం 16000 మంది పోలీసులతో నగరానికి భద్రత కల్పించడం మరియు సేవలందించడం చాలా పెద్ద సవాలు, అయినప్పటికీ మన పోలీసులు బాగా పని చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు అధికారుల విధి నిర్వహణలో చూపిస్తున్న అంకితభావం మరియు నిబద్ధతను కమిషనర్ ప్రశంసించారు మరియు వారి విధులను నిర్వర్తించడంలో మరియు కేసులను గుర్తించడంలో గణనీయమైన కృషికి మరియు అసాధారణమైన అంకితభావంతో విజేతలు గా నిలిచినందుకు రివార్డ్ గ్రహీతలను అభినందించారు.
ఎన్. శ్వేత, ఐపిఎస్ సిసిఎస్ డిడి & HFAC Addl.సిపి క్రైం ఆండ్ సిట్, మరియు , డి.కవిత డిసిపి సైబర్ క్రైమ్ హైదరాబాద్‌, మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ ల బదిలీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *