జిల్లా పోలీస్ శాఖలో యస్.ఐగా పనిచేస్తున్న సి.హెచ్ వెంకటయ్యని పదవి విరమణ పొందుతున్న సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా యస్.పి ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖ లో 41 సంవత్సరాల పాటు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయం అని అన్నారు.మీ యొక్క సేవలు అనుభవాలు పోలీస్ శాఖ కు చాలా అవసరం ఉంటాయని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజం అని పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అన్నారు.అనంతరం వారికీ అందవలసిన ఆర్దిక సదుపాయాలను అందజేసినారు.
ఈ కార్యక్రమంలోపోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సోమయ్య, సిబ్బంది పాల్గొన్నారు