బ్రేకింగ్ న్యూస్
పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానాపదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానా
Uncategorized

పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయం

పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయం

పదవీ విరమణ పొందిన హోంగార్డ్ శంకర్ రెడ్డికి ఘన సత్కారం.. వీడ్కోలు పలికిన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది సహజమైన ప్రక్రియ అని, ఉద్యోగ కాలంలో అందించిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న హోంగార్డ్ శంకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

2026 సెప్టెంబర్ 24 నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందుతున్న శంకర్ రెడ్డిని అదనపు ఎస్పీ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. శంకర్ రెడ్డి గత 23 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలు పోలీస్ శాఖకు గుర్తుండిపోతాయని అన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

పదవీ విరమణ అనంతరం కూడా శంకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అదనపు ఎస్పీ తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు డానియెల్, సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.