Breaking News

హైదరాబాద్ సిటీ పోలీసులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు“ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” పేరుతో కార్యక్రమంప్రారంభించిన డైరెక్టర్ జనరల్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి.

హైదరాబాద్ సిటీ పోలీస్‌ “ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” పేరుతో విస్తృత స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి ప్రారంభించారు. టిజిఐసిసిసి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఈ శిక్షణా కార్యక్రమ ప్రారంభోత్సవంలో హైదరాబాద్ సీపీ శ్రీ వి.సి సజ్జనర్ తో కలిసి డిజిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణా మెటిరియల్ ప్రతులను వారు ఆవిష్కరించారు.
పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి, ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడమే ఈ శిక్షణా కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కమిషనరేట్ పరిధిలోని 19,488 మందికి దశలవారిగా శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చరిత్రలో అందరికీ ఈ తరహా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి.
క్షేత్ర‌స్థాయి సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చేందుకు గాను 178 మంది ప్రత్యేక శిక్షకులను ఎంపిక చేశారు. అందులో 74 మంది ఏసీపీలు, 98 మంది ఇన్‌స్పెక్టర్లు / రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, 6 మంది ఎస్సైలు ఉన్నారు. వారందరికీ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్(టీవోటీ) కార్యక్రమం నిర్వహించారు. వీరంతా తమ తమ డివిజన్ల పరిధిలోని సిబ్బందికి శిక్షణను ఇస్తారు.


ఈ కార్యక్రమంలో డిజిపి శ్రీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ… పోలీసింగ్ లో వస్తోన్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు రీస్కిల్లింగ్ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యోగి జీవితంలో శిక్ష‌ణ కీలకపాత్ర పోషిస్తుందని, ట్రైనింగ్ లో అనేక కొత్త విషయాలను నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం పెరిగిందని, అందుకు అనుగుణంగా పోలీసుల ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని వివరించారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింతగా పెంచడంలో ఈ శిక్షణ దోహదం చేస్తుందని అన్నారు. “ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” అనే పేరుతో సిబ్బంది అందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అనే ఆలోచన మంచిందంటూ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న హైదరాబాద్ సిపి శ్రీ వి.సి సజ్జనార్ ని అభినందించారు
హైదరాబాద్ సిపి శ్రీ వి.సి సజ్జనర్ మాట్లాడుతూ.. ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే సిబ్బందికి శిక్షణ అవసరం అన్నారు. ఈ శిక్షణ నైపుణ్యం పెంచడంతో పాటు అందరికీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఒక నెల నుంచి కసరత్తు చేసి.. మంచి ప్రణాళికతో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని ఒక సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా తీర్చిదిద్దేలా రూపొందించామని తెలిపారు. గ‌తాన్ని తెలుసుకుని.. భవిష్యత్తు దిశలో ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రవర్తన, పనితీరే పోలీస్ ప్రతిష్టను ఇనుమడింపజేస్తోందనే విషయాన్ని సిబ్బంది గుర్తుంచుకోవాలని వివరించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు..


ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి (క్రైం) శ్రీ ఎం. శ్రీనివాస్, జాయింట్ సిపి (అడ్మిన్) శ్రీమ‌తి ప‌రిమ‌ళ హాన నూత‌న్, డిసిపి (హెడ్‌క్వార్టర్స్) శ్రీమతి రక్షితా కృష్ణమూర్తి, డిసిపి(ఎస్బీ) శ్రీమ‌తి కె. అపూర్వ‌రావు, డీసీపీ(డీడీ) శ్రీమ‌తి శ్వేత, డిసిపి సౌత్ జోన్ శ్రీమతి స్నేహా మెహ్రా ఐపిఎస్ , శ్రీ.బి.బాలస్వామి ఐపిఎస్ డిసిపి ఈస్ట్ జోన్ మరియు శిక్షణా ఫ్యాకల్టీలు శ్రీ జి. యుగందర్, శ్రీ ఎ. మల్లేశ్, శ్రీమతి నళినిలతో పాటు అన్ని అన్ని జోన్ల డిసిపిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *