
నల్గొండ జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపిఎస్ “నేను సైతం మరియు కమ్యూనిటీ సీసీటీవీ” కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామంలో, వార్డ్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని కోరడం జరిగింది. తేదీ 25.10.2025 శాంతి నగర్ లో నివాసం ఉండే జెర్రిపోతుల రవి, వయసు 35, వృత్తి. పంచాయతీ సెక్రటరీ, రాత్రి. 7 గంటలకు ఇంటికి తాళం వేసి, ఊరికి వెళ్లి తిరిగి ఉదయం వచ్చేసరికి తాళం పగలగొట్టి, బీరువా ఓపెన్ చేసి దానిలో ఉన్న బంగారు,వెండి ఆభరణాలు కొంత నగదు దోచుకెళ్లారని పిర్యాదు ఇవ్వడం తో వన్ టౌన్ పీఎస్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో పిర్యాదిదారుడి ఇంటి పక్కన స్థానికుడు ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమెరాను పరిశీలించగా, గతంలో పలు దొంగతనాలు చేసిన కరుడు గట్టిన అంతరాష్ట్ర దొంగ మరియు పాత నేరస్తుడు అయిన రుద్రాక్షి శ్రీను s/o బిక్సమ్ అని తెలిసింది. వెంటనే జిల్లా ఎస్పీ, డీఎస్పీ కె శివరాం రెడ్డి కి ఆదేశాలు ఇస్తూ, ccs బృందాన్ని, వన్ టౌన్ సిబ్బందిని సమాయత్తం చేయడం జరిగింది. ఉదయం మునుగోడు రోడ్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా, అనుమానాస్పదంగా బైక్ పై పారిపోతున్న ఒక వ్యక్తిని ccs టీమ్ మరియు వన్ టౌన్ పోలీసులు పట్టుబడి చేసి విచారించగా తాను గతంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 40 వరకు దొంగతనాలు చేసి ఇటీవల తిరుపతి జైలుకు వెళ్లి, తన ప్రవృత్తి మార్చుకోకుండా తిరిగి పదిహేను రోజుల క్రితం బయటకు వచ్చాడని, తేదీ 25.10.2025 న నల్గొండ పట్టణంలోని శాంతి నగర్ లోని ఒక ఇంటి లో దొంగతనం, పక్కనే ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్ దొంగతనం మరియు దేవరకొండ రోడ్ లోనీ కనక దుర్గా కాలనీలో మరొక ఇంట్లో దొంగతనం చేసిన నేరాలు (3) ఒప్పుకొని, దొంగిలించిన సొత్తు, బైక్ ను చూపించగా వాటిని స్వాధీనం చేసుకుని నేరస్తుడు అయిన రుద్రాక్షి శ్రీను ను జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం రిమాండ్ కి తరలించనైనది. 1. సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు, 2. సుమారు 35 తులాల వెండి ఆభరణాలు, 3. యునికార్న్ బైక్. ఇట్టి కేసులను సీసీ కెమెరాల ఆధారంగా ఫింగర్ ప్రింట్స్ సేకరణ ఆధారంగా కేవలం వారం రోజుల్లోనే కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగను పట్టుబడి చేసి చాకచక్యంగా కేసులలో ప్రతిభ కనబరిచిన నల్గొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి ని సిసిఎస్ ఇన్స్పెక్టర్లు జితేందర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్సై విజయ్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు, వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, గోపాలరావు, వెంకట నారాయణ, షకీల్, రబ్బాని, ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ శివ, సిసిఎస్ సిబ్బంది సాయి, మహేష్, వహీద్, దస్తగిరి జునైద్ తదితరులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అభినందించారు.

