బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

గ్రామీణప్రాంత విద్యార్థుల అభివృద్ధి కై ఇన్స్పిరేషన్,మోటివేషన్ కార్యక్రమం-జిల్లా ఎస్పీ.

ఐఐటి-హైదరాబాద్ నందు ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు ఐఐటి హైదరాబాద్, రూరల్ డెవెలప్మెంట్ సెంటర్ అధ్వర్యంలో నిర్వహించిన “ప్రేరణ” ఒక మంచి కార్యక్రమం అని, మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తు పై పట్టు సాధించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే మంచి లక్ష్యాలను నిర్దేశించికొని, వాటిని సాధించే విధంగా కృషి చేయాలని, విజయం ఎవ్వరిని ఊరికే వరించదని, కష్టపడి చదివినప్పుడే విజయ తీరాలను చేరుకోగళం అన్నారు. ప్రస్తుత సమాజంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రానిస్తున్నారని, అన్ని రంగాలలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, మహిళలు నిర్భయంగా ముందుకు వచ్చి, స్త్రీ శక్తిని చాటాలని పిలునిచ్చారు. ముఖ్యంగా జిల్లాలో మహిళల భద్రతకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని, మహిళల రక్షనార్ధమై జిల్లా వ్యాప్తంగా షి-టీమ్ బృందాలను ఏర్పాటు చేసి, మహిళల, బాలల రక్షణకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు భరోసానిస్తూ భరోసా సిబ్బంది అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం జరుగుతుంది అన్నారు. ఆన్లైన్ మోసాలకు సంభందించి చిన్న పిల్లలకు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నారు. సైబర్ మోసాల గురించి జిల్లా సైబర్ వారియర్ సిబ్బంది మాట్లాడుతూ.సైబర్ నేరగాళ్లు చిన్న పిల్లలే టార్గెట్ గా చేసుకొని ఆన్లైన్ గేమ్స్ మాటున తప్పుడు లింక్స్ పంపుతూ పిల్లలను గేమ్స్ కు బానిసలయ్యే ల చేస్తూ వివిధ రకాల సైబర్ నేరాలను పాలపడుతున్నారని, తల్లిదండ్రులుగా పిల్లలను, వారి కదలికలను, మరియు వారు ఏ విధమైన గేమ్స్ అడుతున్నారని, ఏఏ సైట్ లను వెతుకుతున్నారని కనిపెట్టాలని అన్నారు. సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా షి-టీం, భరోసా సిబ్బంది మాట్లాడుతూ.మహిళలు, బాలికలు మీకు జరిగిన అన్యాయాన్ని గురించి నిర్భయంగా షి టీం తో చెప్పుకోవాలని, షి టీం బృందాలు మీ సమస్య తక్షణ పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డా. హిమబిందు, ఎమ్‌.ఏ.ఈ. విభాగం, డా. శుహిత, ఎల్‌.ఏ. విభాగం, డా. అర్వింద్, సి.ఎస్‌.ఈ. విభాగం, డా. ప్రేమ్‌పాల్, ఫిజిక్స్‌ విభాగం, డా. మయుఖ్ పహారి, ఫిజిక్స్‌ విభాగం, సతీష్ – రూరల్ డెవెలప్మెంట్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్, కంది మండల విద్యాధికారి, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతి, షి-టీం ఎస్ఐ, భరోసా, సైబర్ వారియర్స్ సిబ్బంది మరియు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విధ్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి