Breaking News

ప్రజాసమస్యల పరిష్కారానికై గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, ఫిర్యాది సమస్యను ఓపికగా విని, సమస్య జాప్యానికి గల కారణాల గురించి సంబంధిత ఎస్.హెచ్.ఓ లకు ఫోన్ ద్వారా మాట్లాడి తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు.
జిల్లా ప్రజలు తమ సమస్యలకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పరిష్కారం దొరకనప్పుడు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, స్వచ్ఛందంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *