బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు.

హైదరాబాద్ సిటీ పోలీస్, సెంట్రల్ జోన్, HCL మరియు హైదరాబాద్ సైక్లిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సైక్లథాన్’ను ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సైక్లథాన్ పీపుల్స్ ప్లాజా నుండి టోలీచౌకిలోని సెవెన్ టోంబ్స్ వరకు సాగింది. ఇందులో 380 మంది సైక్లిస్టులు, 100 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజీ బి. శివధర్ రెడ్డి IPS మరియు సీపీ హైదరాబాద్ వి.సి. సజ్జనార్ IPS ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ జోన్ డిసిపి శ్రీమతి కె. శిల్పవల్లి, ఐపిఎస్ హాజరయ్యారు. వారితో పాటు గాంధీనగర్ ఏసిపి యాదగిరి, ఖైరతాబాద్ ఎస్హెచ్ఓ వెంకట్ రెడ్డి మరియు HCL ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి శ్రీమతి కె. శిల్పవల్లి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం పోలీసు శాఖతో కలిసి ఈ సైక్లథాన్ నిర్వహించిన HCL యాజమాన్యానికి మరియు హైదరాబాద్ సైక్లిస్ట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల వలన పోలీసుల పట్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుందని, పోలీసు-ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పొరేట్ సంస్థలు సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే, రేపు (27.10.2025) హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లలో నిర్వహించబడే “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు”లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సెంట్రల్ జోన్ పరిధిలోని ప్రజలందరూ పోలీసులతో స్నేహపూర్వకంగా మెలగాలని, శాంతిభద్రతల పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలని డిసిపి విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు లేదా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. “ప్రజా సహకారంతోనే సురక్షితమైన, నేరరహిత సమాజాన్ని నిర్మించగలం,” డిసిపి శ్రీమతి కె. శిల్పవల్లి పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి