
నల్లగొండ జిల్లాలో గత రెండు నెలలుగా రైతులు కొన్ని సంవత్సరాల కాలం పాటు పెంచుకున్న శ్రీగంధం చెట్లను అక్రమంగా నరికి దొంగతనాలకు పాల్పడుతున్నారని సమాచారం మేరకు తేది : 30.09.2025 అర్ద రాత్రి సమయములో కనగల్ మండల పరిధి లోని నేషనల్ హైవే 595 రోడ్ కి సమీపములోని ఒక శ్రీ గంధం చెట్లు ఉన్న చిలుక విద్యాసాగర్ తోట లోకి వెళ్ళి చెట్లు కోసే రంపం మిషన్ లు, గొడ్డల్లు, ఉపయోగించి తోటలో 10 శ్రీగంధం చెట్ల మొద్దులు దొంగిలించుకొని, ఇంకా 5 శ్రీగంధం చెట్ల నరికి వదిలివేసినారు అని చిలుక విద్యాసాగర్ రెడ్డి పిర్యాదుపై కేసు నమోదు చేయనైనది. ఇట్టి కేసు పరిశోదనలో బాగంగా, జిల్లా ఎస్.పి. శరత్ చంద్ర పవర్, ఐపిఎస్, ఆదేశాల ప్రకారం, నల్లగొండ డి.ఎస్.పి కె.శివరాం రెడ్డి ఆధ్వర్యములో నాలుగు బృంధాలుగా ఏర్పడి తనిఖీలు చేయుచుండగా, ఉదయం 06.00 గం,,ల సమయంలో కనగల్ పోలీసులు నల్గొండ – దేవరకొండ రహదారిపై రంగారెడ్డి బంగ్లా వద్ద వాహానాలు తనిఖీలు నిర్వహిస్తుండగా దేవరకొండ వైపు నుండి నల్గొండ వైపు కి రెండు బైక్ AP-31-BS-1571,AP-28-DQ2491 లపై వెళ్ళు చున్న ముగ్గురు అనుమానస్పధముగా వెనుకకు తన బైక్ లను తిప్పుకొని వెళ్ళుచుండగా వారిని కనగల్ పోలీస్ వారు పట్టుబడి చేసి వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న 3 రంపాలు, 3 గొడ్డల్లు, ఫెన్సింగ్ వైర్ కట్ చేసే ఒక కట్టర్, ఒక ఆక్సల్ బ్లేడ్, మూడు మొబైల్ ఫోన్ లు రెండు బైక్ ల పై వెళ్తున్నా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ! A-1: అన్నాభౌ లక్ష్మణ్ గైక్వాడ్ , మహారాష్ట్ర (పరారీలో),A-2: దివానా తండ్రి కుక్కనీయ, మద్యప్రదేశ్,A-3: దద్ద సింగ్ తండ్రి రామ్ సింగ్, మద్యప్రదేశ్,A-4 మజాన్ తండ్రి అన్మెష్ సింగ్, మద్యప్రదేశ్,A-5: జవాస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం (పరారీలో),A-6: అజుబా మధ్యప్రదేశ్ రాష్ట్రం (పరారీలో) పైన తెల్పిన ఏ-2 నుండి ఏ-6 నేరస్తులు వారందరు మద్య ప్రదేశ్ రాష్ట్రము, అజుబా గవన్ గ్రామం, రిటీ తహసిల్, కట్నీ మరియు పన్నా జిల్లాలకు చెందిన వారు. వీరు దేశము లోని వివిద ప్రాంతలో సంచార జీవనము గడుపుతూ రుద్రాక్షలు & పూసలు అమ్ముకొంటూ జీవనం గడుపుతుంటారు, వీరు ఎక్కడికి వెళ్ళిన గ్రామా శివారు ప్రాంతలో గుడారాలు వేసుకొని నివసిస్తుంటారు, గత రెండు నెలల క్రితం వీరికి మహారాష్ట కు చెందిన ఏ-1 అన్నాభాహు లక్ష్మణ్ గైక్వాడ్ అను వ్యక్తి పరిచయం అయినాడు. వీరు అంత హైద్రాబాద్ లో ఉన్నప్పుడూ ఏ-1 వీరి గుడిసెల వద్దకు వచ్చేవాడు. మీరు ఎన్ని రోజులు రుద్రాక్షలు అమ్మిన మీరు ధనవంతులు కాలేరని,మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు తొందరగా అధిక డబ్బులు సంపాదింవచ్చు అని, తెలంగాణ రాష్ట్రములోని వివిద ప్రాంతలోని రైతులు శ్రీ గంధం చెట్లు సాగు చేస్తుంటారు, అట్టి శ్రీ గంధం కర్రలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది, కాబట్టి అట్టి చెట్లను నరికి ఏ-1 కు ఇస్తే, ఏ-1 వాటిని అక్రమ రవాణా చేసి, అట్టి కర్రలును అమ్మి మీకు అట్టి డబ్బులో వాటా ఇస్తాను అని వారితో చెప్పగా, అలా దొంగతనముగా రైతుల కష్టపడి కొన్ని సం,, ల నుండి సాగు చేసుకొంటున్న శ్రీ గంధం చెట్లును నరికి వాటి కర్రలను దొంగలించడం నేరము అని తెలిసిన కూడా అధిక డబ్బులు సంపాదించాలానే దూరాశ తో దొంగతనం చేయడానికి ఒప్పుకొని, నల్గొండ జిల్లాలో గత రెండు నెలలో కనగల్ మండలంలోని తెలకంటి గూడెం, తిమ్మన్న గూడెం,నార్కట్ పల్లి మండలం,గుర్రంపోడు మండలం,నల్లగొండ రూరల్, చండూరు మండలం మొత్తం 6 దొంగతనాలు చేసినారు. వీరు 40 కేజిల షాగాను అప్పచెప్పాగా, ఒక్కొక్కరికి రూ. 10,000/- చొప్పున 50,000/- ఇవ్వడం జరిగింది నేరం ఒప్పుకోగా నిందితులను నేడు అరెస్టు చేసి రిమాండుకు తరలించడం జరీగింది. వీరు వివిధ ప్రాంతాల్లో రైతులు పెంచిన సుమారు 166 శ్రీగంధం చెట్లు నరికి నష్టపరచగా సుమారు 1 కోటి 66 లక్షల విలువగల ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇట్టి కేసును నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో త్వరితగతిన చేదించిన సిఐ-చండూర్ కె ఆధి రెడ్డి, ఎస్.ఐ. లు కె రాజీవ్ రెడ్డి, కనగల్, N. వెంకన్న, చండూర్, D. సైదా బాబు, నల్లగొండ రూరల్, CI రైటర్ వి. రమేశ్, జానకి రాములు, తిరుమలేష్, శ్రీకాంత్, రాజు, బాలకోటి, శంకర్, శేఖర్, B. సురేశ్, CH.రమేశ్, T వెంకట్ రెడ్డి లను జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవర్ ఐపిఎస్ అబినందించినారు.

