Breaking News

మహబూబాబాద్ నందు షీ టీం భరోసా,AHTU అవగాహన కార్యక్రమం.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, కేసముద్రం పిఎస్ పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ ZPHS హై స్కూల్ నందు షీ టీం, భరోసా, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU)ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్సై సునంద సంయుక్తంగా విద్యార్థిని విద్యార్థులతో లతో మాట్లాడుతూ.యువత చెడు అలవాట్లకు లోను కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలి. అపరిచితుల ఫోన్ కాల్స్‌కి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు. వేధింపులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. విద్యార్థినిల భద్రతే షీ టీం లక్ష్యం అని తెలిపారు, అలాగే మహిళలు ఎక్కువగా తెలిసిన వ్యక్తుల నుండే వేధింపులకు గురవుతున్నారని, అలాంటి సందర్భాల్లో ఎలాంటి భయం లేకుండా షీ టీంను సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నంబర్లు 100, షీ టీం వాట్సాప్ నెంబర్ : 8712656935 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ: 1930 అలాగే, విద్యార్థినిలు T-SAFE యాప్ ఉపయోగించడం ద్వారా ప్రయాణాన్ని సురక్షితంగా చేసుకోవచ్చని, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేసి సైబర్ నేరాల బారిన పడకూడదని సూచించారు. ఒకవేళ సైబర్ నేరాల బారిన పడిన అధైర్య పడకుండా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్1930 ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అవగాహన, పోక్సో చట్టం, మహిళా & బాలల రక్షణ చట్టాలు గురించి మరియు మైనర్ డ్రైవింగ్ గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కేసముద్రం ప్రిన్సిపల్ మల్లికార్జున,ZPHS హై స్కూల్ ఇన్చార్జి G. Srinivas, మరియు కాలేజీ అండ్ స్కూల్ లెక్చరల్స్, షీ టీం, సిబ్బంది ASI సుధాకర్,HC సుధాకర్,WPC అరుణ, పార్వతీ భరోసా, రేణుకా, రేణుకా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సిబ్బంది సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *